News July 8, 2024
కృష్ణమ్మను తాకిన గోదారి

AP: గోదావరి నీళ్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణమ్మ ఒడికి చేరాయి. విజయవాడ సమీపంలోని ఫెర్రీ వద్ద నిన్న సాయంత్రం గోదావరి జలాలు కృష్ణానదిలో కలిశాయి. ఈ నెల 3న పోలవరం సమీపంలోని పట్టిసీమ వద్ద మంత్రి నిమ్మల రామానాయుడు పంపులను ఆన్ చేసి నీటిని కుడి కాలువలోకి విడుదల చేశారు. 5 రోజుల ప్రయాణం తర్వాత ఆ నీళ్లు కృష్ణమ్మను చేరాయి. దీంతో కృష్ణా డెల్టా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 4, 2026
మండుతున్న ఎండలు.. భారీగా బీర్ల అమ్మకాలు

TG: రాష్ట్రంలో బీర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఎండలు మండుతుండడంతో వీటి అమ్మకాలు సాధారణం కన్నా 40% పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి MAR చివర్లో బీర్లకు డిమాండ్ ఏర్పడుతుంటుంది. కానీ ఈసారి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆరంభంలోనే ఆ పరిస్థితి ఉంది. ఇక HYDలో నెలాఖరు నుంచి బీరు అమ్మకాలు పెరుగుతాయి. ఈ అమ్మకాల ద్వారా వేసవి 3మాసాల్లో ₹7000 CR GOVTకి రానున్నాయి.
News March 4, 2026
ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్‌లో 30 పోస్టులు..

<
News March 4, 2026
సౌతాఫ్రికాతో సెమీస్.. టాస్ గెలిచిన NZ

T20WC: కోల్‌కతాలో జరగనున్న తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
సౌతాఫ్రికా: మార్క్రమ్ (C), డికాక్, రికెల్టన్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, రబాడ, జాన్సెన్, కేశవ్ మహరాజ్, బాష్, లుంగి ఎంగిడి.
న్యూజిలాండ్: సీఫర్ట్, అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, నీషమ్, శాంట్నర్ (C), మెక్‌కొంచి, హెన్రీ, ఫెర్గ్యూసన్.


