News October 29, 2024
గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి కందుల

AP: గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ‘2027లో జరిగే పుష్కరాలకు భారీగా ఏర్పాట్లు చేస్తాం. 8 కోట్ల మంది పుష్కరాలకు వస్తారని అంచనా. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. భద్రతా ఏర్పాట్లపై CM, Dy.CMతో చర్చిస్తాం’ అని తెలిపారు. జిల్లా కేంద్రమైన రాజమండ్రిని అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని MP పురందీశ్వరి తెలిపారు.
Similar News
News January 21, 2026
కొనసాగిన నష్టాలు

స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాల వైపే మొగ్గు చూపారు. ఒకానొక దశలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల నష్టాల్లోకి వెళ్లింది. మధ్యాహ్నం తర్వాత కాస్త పుంజుకొని చివరికి 270 పాయింట్ల నష్టంతో 81,909 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి 25,157 వద్ద సెటిల్ అయింది.
News January 21, 2026
అమరావతికి చట్టబద్ధత.. పార్లమెంటులో బిల్లు!

AP రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. క్యాబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించాలంటూ కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. రాజధాని ఎంపిక ప్రక్రియ, నిర్మాణాలపైనా నోట్ ఇచ్చింది. కాగా ఏ తేదీ నుంచి రాజధానిగా గుర్తించాలో చెప్పాలని కేంద్రం కోరినట్లు సమాచారం.
News January 21, 2026
గుడ్న్యూస్.. మరో ఐదేళ్లు అటల్ పెన్షన్ యోజన

అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందించేందుకు తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన(APY) పథకాన్ని కొనసాగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. మరో ఐదేళ్లు(2030-31) పొడిగించేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం APYలో 8.66 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. 18-40 ఏళ్ల వారు ఈ స్కీమ్లో చేరొచ్చు. వయసును బట్టి రూ.42 నుంచి రూ.1,454 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటాక రూ.1000-5000 వరకు పెన్షన్ అందుతుంది.


