News December 27, 2024
జపాన్‌లో ‘దేవర’ తాండవం.. ఎప్పుడంటే?
జపాన్‌ను తెలుగు సినిమాలు షేక్ చేయనున్నాయి. ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘కల్కి’ వచ్చే నెల 3న రిలీజ్‌కు సిద్ధమైంది. దీంతోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా కూడా జపానీస్‌లో రిలీజ్ కానుంది. 2025 మార్చి 28న ఈ చిత్రం విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన టికెట్స్ జనవరి 3 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ‘దేవర’ ఇండియాలో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
Similar News
News December 28, 2024
స్టాక్స్‌కు దూరం.. FDలకే మన్మోహన్ మొగ్గు
ఆర్థికవేత్తగా తన సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపించిన మన్మోహన్ సింగ్ స్టాక్‌మార్కెట్‌కి ఎప్పుడూ దూరంగా ఉండేవారు. అందులో ఒడిదుడుకులతో నిద్ర కోల్పోవడం తనకు ఇష్టం లేదని 1992లో పార్లమెంటులో ఆయన చెప్పారు. తన డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్‌లో మాత్రమే పెట్టేవారు. 2019 నాటికి ఆయన మొత్తం ఆస్తి విలువ రూ.15కోట్లు. అందులో FDల్లో రూ.7 కోట్లు, పోస్టాఫీస్‌లో రూ.12 లక్షలు ఉంది.
News December 28, 2024
నేడు మన్మోహన్ అంత్యక్రియలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను ఇవాళ ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో జరగనున్నాయి. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. తొలుత మన్మోహన్ పార్థీవ దేహాన్ని ఆయన నివాసం నుంచి AICC కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచి నిగమ్‌బోధ్ ఘాట్‌కు తీసుకెళ్తారు.
News December 28, 2024
రెండు పార్టులుగా VD12 మూవీ: నాగవంశీ
గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ నటిస్తున్న VD12 మూవీ రెండు పార్ట్‌లుగా రాబోతోందని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. అయితే రెండు పార్టుల్లో వేర్వేరుగా కథ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం తొలి భాగం 80 శాతం షూటింగ్ పూర్తయ్యిందన్నారు. మార్చిలో మూవీ విడుదలకు ప్లాన్ చేస్తున్నామని, ఒకవేళ హరిహరవీరమల్లు రిలీజ్ ఉంటే వాయిదా వేస్తామని చెప్పారు.