News October 12, 2025

‘గాడ్ ఫాదర్’ నటి, ఆస్కార్ విన్నర్ కన్నుమూత

image

ఆస్కార్ నటి డయాన్ కీటన్(79) కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని నివాసంలో ఆమె మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మరణానికి కారణాలు వెల్లడించలేదు. కీటన్ హాలీవుడ్ ఫేమస్ మూవీ ‘ది గాడ్ ఫాదర్’(1972) చిత్రంతో ‘కే ఆడమ్స్’ పాత్రతో ఆమె వెలుగులోకి వచ్చారు. సీక్వెల్‌లోనూ డయాన్ నటించారు. ‘ఆనీ హాల్’(1977) చిత్రంలో నటనకుగాను ఆస్కార్ అందుకున్నారు. దాదాపు 50ఏళ్ల పాటు సినిమాల్లో నటించారు.

Similar News

News October 12, 2025

తిరుమలలో పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటలు

image

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లు నిండిపోయి భక్తుల క్యూ లైన్ శిలాతోరణం వరకు దాటిపోయింది. నిన్న 84,571 మంది స్వామివారిని దర్శించుకున్నారు. కానుకల రూపంలో ₹3.70 కోట్లు సమర్పించారు. 36,711 మంది తలనీలాలు అర్పించారు. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు దర్శనానికి 20 గంటలు పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారు కేటాయించిన సమయానికి మాత్రమే క్యూలోకి రావాలని టీటీడీ సూచించింది.

News October 12, 2025

HSCC లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

హాస్పిటల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ కార్పొరేషన్(HSCC)లిమిటెడ్‌లో 27 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఎంబీఏ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఫార్మసీ డిగ్రీ, పీజీ డిప్లొమా, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజినీరింగ్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: http://hsccltd.co.in/

News October 12, 2025

దీపావళి ఆఫర్లు ప్రకటించిన టాటా, హ్యుందాయ్

image

దీపావళి సందర్భంగా పలు ఆటోమొబైల్ కంపెనీలు ఆఫర్లు ప్రకటించాయి. అక్టోబర్ 21 వరకు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛైంజ్ ఆఫర్లు, లాయల్టీ బోనస్‌లు ఉంటాయని టాటా మోటార్స్ తెలిపింది. టియాగోపై రూ.20-30వేలు, నెక్సాన్‌పై రూ.35వేలు, పంచ్‌పై రూ.25వేలు డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొంది. అటు హ్యుందాయ్ కంపెనీ సైతం వివిధ కార్లపై ఆఫర్లు ప్రకటించింది. జీఎస్టీ తగ్గింపు, తాజా డిస్కౌంట్లతో కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి.