News August 22, 2024
CM చంద్రబాబుతో గోద్రెజ్ ప్రతినిధుల భేటీ

AP: సీఎం చంద్రబాబును గోద్రెజ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ నాదిర్ గోద్రెజ్ కలిశారు. ఈ భేటీలో రూ.2800 కోట్ల పెట్టుబడులపై చర్చలు జరిగినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. అమరావతి, విశాఖలో పురుగుమందు, రొయ్యల మేత తయారీ, ఆయిల్ పామ్ సాగుపై చర్చలు జరిగాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పెంచే పలు అంశాలపై మాట్లాడినట్లు సీఎం పేర్కొన్నారు.
Similar News
News December 30, 2025
ఖలీదా జియా మరణం.. బంగ్లాతో భారత్ కొత్త ప్రయాణానికి బ్రేక్ పడినట్లేనా?

బంగ్లాలో రాజకీయ అస్థిరత నెలకొన్న వేళ ఆ దేశ తొలి మహిళా ప్రధాని, BNP అధినేత్రి జియా <<18709090>>మరణం<<>> పెద్ద మలుపుగా మారింది. బంగ్లాలో ర్యాడికల్ గ్రూప్‌లు చెలరేగుతుండటంతో BNPతో భారత్ సత్సంబంధాల కోసం యత్నిస్తున్న వేళ ఈ పరిణామం జరిగింది. దీంతో బంగ్లాతో కొత్త ప్రయాణానికి బ్రేక్ పడొచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించినప్పుడు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
News December 30, 2025
ఇంటర్‌తో 394 పోస్టులు.. అప్లై చేశారా?

నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీలో 394 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇంటర్ అర్హతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగినవారు UPSC వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ స్టాండర్డ్స్, రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు జులై1, 2007-జులై1, 2010 మధ్య జన్మించి ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100. మహిళలు, SC, STలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: upsc.gov.in/
News December 30, 2025
కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

AP: లైఫ్ ట్యాక్స్ వర్తించే వాహనాలపై ఆ పన్నులో 10% చొప్పున “రోడ్ సేఫ్టీ సెస్” వసూలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఆ మొత్తాన్ని రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు బదిలీ చేసి రోడ్ల మెరుగుదల, భద్రతా చర్యలకు వినియోగిస్తామని పేర్కొంది. ఈ సెస్ ద్వారా సంవత్సరానికి రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. GST తగ్గింపుతో వాహనాల రేట్లు తగ్గాయని, వాహనదారులకు ఈ సెస్ భారం కాబోదని తెలిపింది.


