News April 15, 2025
‘కోపిష్టి’ ఇమేజ్ను మార్చుకునే పనిలో గోయెంకా!

IPLలో తమ జట్టు ఓటమి తర్వాత కెప్టెన్, ఆటగాళ్లకు <<15878257>>క్లాస్ తీసుకునే<<>> LSG ఓనర్ సంజీవ్ గోయెంకా ఈసారి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నిన్న థ్రిల్లర్ మ్యాచ్లో CSK చేతిలో ఓటమి తర్వాత కూడా నవ్వుతూ కనిపించారు. కెప్టెన్ పంత్ భుజంపై చేయి వేసి సరదాగా మాట్లాడారు. CSK సారథి ధోనీని హత్తుకుని అభినందించారు. దీంతో ఆయన తన ‘కోపిష్టి’ ఇమేజ్ను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News December 12, 2025
ఇతిహాసాలు క్విజ్ – 94 సమాధానం

ఈరోజు ప్రశ్న: పైన చిత్రంలో ఉన్న మహాభారత పాత్ర ఎవరిది? ఆయనను ఎవరు చంపారు?
సమాధానం: పైన చిత్రంలో ఉన్నది గాంధారికి సోదరుడు, దుర్యోధనుడికి మేనమామ అయిన ‘శకుని’. మహాభారతంలో ఈయన కౌరవుల పక్షాన ఉంటాడు. పాండవులపై కుట్రలు పన్నుతాడు. పాచికల ఆటలో మోసం చేసి, పాండవుల రాజ్య నాశనానికి, ద్రౌపది అవమానానికి కారణమవుతాడు. దీనికి ప్రతీకారంగా కురుక్షేత్రంలో సహదేవుడు శకునిని సంహరిస్తాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 12, 2025
భారత్ ఘన విజయం

U-19 ఆసియా కప్లో UAEపై టీమ్ ఇండియా అద్భుత విజయాన్ని సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 433 పరుగులు చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. వైభవ్ సూర్యవంశీ 171 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో UAE 14 ఓవర్లకే వికెట్లు కోల్పోయింది. అనంతరం ఉద్దిశ్ సూరీ(78), పృథ్వీ మధు(50) పోరాడినా ఆ టీమ్ 199/7 రన్స్కే పరిమితమైంది.
News December 12, 2025
ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీ పెద్దలతో భేటీకానున్నారు. 18న సాయంత్రం విజయవాడ నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనున్నారు. అదేరోజు రాత్రి పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశముంది. పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఆమోదాలు, అనుమతులపై చర్చించే అవకాశం ఉంది. 19న సాయంత్రం తిరిగి విజయవాడ బయల్దేరనున్నారు.


