News August 30, 2024
KL రాహుల్‌తో వాగ్వాదంపై స్పందించిన గోయెంకా

IPL-2024లో SRHతో జరిగిన మ్యాచ్‌లో KL రాహుల్‌తో వాగ్వాదంపై LSG ఓనర్ సంజీవ్ గోయెంకా తాజాగా స్పందించారు. ‘జట్టులో ఒకరు విఫలమైతే అర్థముంది. కానీ 11 మందీ విఫలం కావడం ఏంటి? అందుకే దీనిపై నేను KLను ప్రశ్నించా. ఎవరైనా వచ్చి ఈ రోజు చెత్తగా ఆడాం అంటే నాకు నచ్చదు. మనపై మనకు నమ్మకం ఉండాలి. లేదంటే ఎప్పటికీ విజయం సాధించలేం. ముంబై ఇండియన్స్ లాగా ఓటమిని ఒక పట్టాన అంగీకరించకూడదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News November 25, 2025
వచ్చే నాలుగేళ్లలో 12.59లక్షల ఇళ్లు: పార్థసారథి

AP: ఐదేళ్లలో 15.59 లక్షల ఇళ్లు కట్టివ్వాలన్న లక్ష్యంలో ఇప్పటికే 3 లక్షలు పూర్తి చేసినట్లు మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ‘ఇళ్లులేని నిరుపేదలకు 2029కల్లా శాశ్వత గృహ వసతి కల్పిస్తాం. వచ్చే నాలుగేళ్లలో 12.59లక్షల ఇళ్లను పూర్తి చేస్తాం. ఉగాదికి 5 లక్షలు, జూన్‌కి మరో 87వేల గృహాలను పూర్తి చేయాలని పని చేస్తున్నాం. CM ఆదేశాల మేరకు 3 నెలలకోసారి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం’ అని తెలిపారు.
News November 25, 2025
ఎర్రనల్లితో పంటకు తీవ్ర నష్టం, నివారణ ఎలా?

ఎర్రనల్లి పురుగు వల్ల పంటలకు చాలా నష్టం జరుగుతుంది. ఎరుపు రంగు శరీరంతో ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా పెరుగుతూ ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులోని పత్రహరితం తగ్గిపోయి ఆకులపై తెలుపు, పసుపు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పాలిపోయి మొక్కలపై బూడిద చల్లినట్లు కళావిహీనంగా కనిపిస్తాయి. ఎర్రనల్లి నివారణకు లీటరు నీటికి డైకోఫాల్ 5ml లేదా అబామెక్టిన్ 0.5ml కలిపి పిచికారీ చేయాలి.
News November 25, 2025
అరుణాచల్ మా భూభాగం: చైనా

షాంఘై ఎయిర్‌పోర్టులో భారత మహిళను <<18373970>>వేధించారన్న<<>> ఆరోపణలను చైనా ఖండించింది. ‘ఎలాంటి నిర్బంధం, వేధింపులకు ఆమె గురి కాలేదు. చట్టాలు, రూల్స్‌కు అనుగుణంగానే అధికారులు వ్యవహరించారు. రెస్ట్ తీసుకునేందుకు చోటిచ్చి, ఆహారం, నీళ్లు అందజేశారు. జాంగ్నాన్(అరుణాచల్) చైనా భూభాగం. ఇండియా చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్‌ను మేం ఎప్పుడూ గుర్తించలేదు’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ చెప్పారు.


