News August 19, 2024

‘బంగ్లా’ త‌ర‌హా గ‌తి ప‌డుతుంది: గవర్నర్‌ను హెచ్చరించిన కాంగ్రెస్ MLC

image

ముడా కేసులో సీఎం సిద్ద‌రామ‌య్య‌పై ఇచ్చిన ఆదేశాల‌ను గ‌ర‌వ్న‌ర్ వెన‌క్కి తీసుకోక‌పోతే, లేదా రాష్ట్రపతి ఆయ‌న్ని ఉప‌సంహ‌రించుకొనేలా చెయ్య‌క‌పోతే ఆయనకు బంగ్లాదేశ్ త‌ర‌హా గ‌తిప‌డుతుంద‌ని క‌ర్ణాట‌క కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇవాన్ డిసౌజా హెచ్చ‌రించారు. బంగ్లాలో ప్ర‌ధాని దేశం విడిచిపారిపోయిన‌ట్టే గ‌వ‌ర్న‌ర్ థావర్ చంద్ గహ్లోత్ క‌ర్ణాట‌క వ‌దిలి పారిపోవాల్సి వ‌స్తుంద‌ని డిసౌజా చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Similar News

News October 28, 2025

వైద్య చిహ్నం వెనుక అసలు కథ!

image

వైద్య రంగానికి వాడే చిహ్నం వెనుక ఉన్న చరిత్ర గురించి మీకు తెలుసా? ఈ చిహ్నాన్ని ‘రాడ్ ఆఫ్ అస్క్లెపియస్’ అంటారని చరిత్రకారులు చెబుతున్నారు. ఒక్క పాము చుట్టుకొని ఉన్న ఈ కర్ర గ్రీకు వైద్య దేవుడు అస్క్లెపియస్‌కు ప్రతీకగా భావిస్తారు. పాము చర్మం విడిచే విధానం పునర్జన్మ, ఆరోగ్యం & నయం కావడాన్ని సూచిస్తుందని తెలియజేస్తున్నారు. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సింబల్ కూడా ఇదే ఉండటం విశేషం.

News October 28, 2025

నీతులు చెప్పేవారు ఆచరించరు.. ట్రంప్‌పై జైశంకర్ పరోక్ష విమర్శలు

image

రష్యా ఆయిల్ కొనుగోలు విషయంలో US ప్రెసిడెంట్ ట్రంప్ వైఖరిని మంత్రి జైశంకర్ పరోక్షంగా విమర్శించారు. ‘సెలక్టివ్‌గా నిబంధనలు వర్తింపజేస్తున్నారు. నీతులు బోధించే వారు వాటిని ఆచరించరు’ అని మండిపడ్డారు. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నా యూరప్‌పై US టారిఫ్స్ విధించకపోవడాన్ని ఉద్దేశిస్తూ ఆసియాన్ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంధన వాణిజ్యం పరిమితమవుతోందని, టెక్నాలజీ, సహజ వనరుల కోసం పోటీ పెరిగిపోయిందన్నారు.

News October 27, 2025

కవిత కొత్తగా..

image

TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త వేషధారణలో కనిపిస్తున్నారు. జనం బాట కార్యక్రమం చేపట్టిన ఆమె గతంతో పోలిస్తే సాదాసీదా చీరలు ధరిస్తున్నారు. హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ఉంది. ప్రస్తుతం కవిత నిజామాబాద్ జిల్లాలో రైతులను పరామర్శిస్తున్నారు. 4 నెలల పాటు ఈ యాత్ర సాగనుంది.