News September 4, 2025

సోలో ట్రిప్‌కి వెళ్తున్నారా?

image

ప్రస్తుతకాలంలో అమ్మాయిలూ సోలో ట్రిప్‌లు చేస్తున్నారు. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందే మీరు వెళ్లే ప్రదేశంలో ఆహార, వసతి, రవాణా సౌకర్యాల గురించి తెలుసుకోండి. చిన్న కీపాడ్ మొబైల్‌ని తీసుకెళ్తే అత్యవసర పరిస్థితుల్లో కాల్ చేయడానికి ఉపయోగపడుతుంది. చాలా తక్కువ లగేజ్‌ ఉండేలా చూసుకోవాలి. కార్డులతో పాటు క్యాష్‌ తీసుకెళ్లడం మంచిది. ఎప్పటికప్పుడు మీ లొకేషన్‌ని సన్నిహితులకు తెలియజేయాలి.

Similar News

News September 6, 2025

ఈ కార్ల ధరలు తగ్గాయ్..

image

మారుతి సుజుకీ బ్రెజా కారు ధర ప్రస్తుతం రూ.8.69 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. మొత్తం 45% పన్ను (28% GST+17% CESS) పడుతోంది. కొత్త జీఎస్టీ ప్రకారం 40% ట్యాక్స్ వేయనున్నారు. సెస్ లేకపోవడంతో రూ.30వేల వరకు ఆదా కానున్నాయి. నెక్సాన్ (పెట్రోల్) కారుపై రూ.68వేల నుంచి రూ.1.26 లక్షలు, వ్యాగన్ Rపై రూ.64వేల-రూ.84వేలు, స్విఫ్ట్‌పై రూ.71వేల-రూ.1.06 లక్షలు, i20పై రూ.83వేల-రూ.1.24 లక్షల వరకు సేవ్ కానున్నాయి.

News September 6, 2025

గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

image

గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు తెలిపారు. గొర్రెలు, కోళ్ల ఉత్పత్తిలో 2వ స్థానం, మాంస ఉత్పత్తిలో 4, పాల ఉత్పత్తిలో 5, గేదెల ఉత్పత్తిలో 6వ స్థానంలో నిలిచిందన్నారు. పశుదాణా, పశుగ్రాస విత్తనాలు, గోకులాల నిర్మాణాలకు సబ్సిడీలో ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలు పశుసంవర్ధక రంగంతో ఉపాధి పొందుతున్నాయని వివరించారు.

News September 6, 2025

పాక్‌పై మే 10న యుద్ధం ముగియలేదు: ఆర్మీ చీఫ్

image

మాజీ సైనికాధికారి KJN ధిల్లాన్ రచించిన ‘ఆపరేషన్ సిందూర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్‌సైడ్ పాకిస్థాన్’ బుక్‌ను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘మే 10న వార్ ముగిసిందని మీరు అనుకోవచ్చు. కానీ అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నందున ఆ తర్వాత కూడా కొనసాగింది. యూనిఫామ్‌లో ఉండి చెప్పలేని అంశాలను ఈ బుక్‌లో కవర్ చేశారు’ అని వ్యాఖ్యానించారు.