News April 8, 2025
సింగపూర్ వెళ్తున్నా: పవన్

తాను ఈ రాత్రి 9.30 గం.కు సింగపూర్ వెళ్లబోతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయనతో పాటు చిరంజీవి దంపతులూ అక్కడికి వెళ్లనున్నారు. ‘నేను అరకులో ఉన్నప్పుడు ఈ విషయం తెలిసింది. నా కొడుకు పక్కనే కూర్చున్న పాపకు తీవ్రగాయాలయ్యాయి. మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మిగతా అందరికీ ధన్యవాదాలు’ అని చెప్పారు. కాగా ఈ ప్రమాద సమయంలో ఆ భవంతిలో 30 మంది పిల్లలు ఉండగా, ఓ చిన్నారి మరణించింది.
Similar News
News April 17, 2025
‘బుంగా’ భలేగా ఉందే!

గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఉండే బుంగా ఇళ్లు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ ప్రాంతంలో వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతతో పాటు శీతాకాలంలో విపరీతమైన చలి ఉంటుంది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో బుంగా ఇళ్లు ప్రజలను వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంచుతాయి. ఈ ఇళ్లు భూకంపాలను సైతం తట్టుకుంటాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. బుంగాను మట్టి ఇటుకలు, మట్టి, పశువుల పేడ, గడ్డి మిశ్రమం, వెదురును ఉపయోగించి నిర్మిస్తారు.
News April 17, 2025
ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్

ఆండ్రాయిడ్ డివైజ్లు డేటా చోరీకి గురి కాకుండా ఉండేందుకు IOS ఇనాక్టివిటీ రీబూట్ ఫంక్షన్ తరహాలో కొత్త ఫీచర్ రానుంది. 3 రోజులపాటు ఫోన్ లాక్ అయి ఉండడం లేదా ఉపయోగించకుండా ఉంటే ఫోన్ ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయి హై సెక్యూరిటీ మోడ్లోకి వెళ్తుంది. ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్లాక్ ఫీచర్లు డిసేబుల్ అవుతాయి. ఫోన్ మళ్లీ వాడాలంటే పాస్ కోడ్ ఎంటర్ చేయాలి. గూగుల్ ప్లే సర్వీసెస్ వెర్షన్ 25.14తో ఈ ఫీచర్ రానుంది.
News April 17, 2025
భారీగా పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 పెరిగి రూ.89,200కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,140 పెరిగి రూ.97,310 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,10,100గా ఉంది. అతి త్వరలోనే తులం బంగారం రూ.లక్షకు చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.