News March 20, 2024
తెలియని వారి పెళ్లిళ్లకు వెళ్లి లాగించేస్తున్నారా?

నోరూరించే వంటకాలను లాగించేయొచ్చని కొంతమంది తెలియని వారి పెళ్లి వేడుకల్లోకి చొరబడిపోతుంటారు. కడుపారా అన్ని ఐటమ్స్ లాగించి కామ్‌గా బయటకొస్తారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఒకవేళ పట్టుబడితే? కొందరైతే మందలించి వదిలేస్తారు లేదంటే.. మీ మీద కేసు నమోదయ్యే ఛాన్స్ ఉంది! అవును పోలీస్ కంప్లైంట్ ఇస్తే IPC సెక్షన్ 441 ‘క్రిమినల్ ట్రెస్పాస్’ కింద మీకు 3 నెలల జైలు/ రూ.500 జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
Similar News
News November 14, 2025
KVS, NVSలో 14,967 పోస్టుల వివరాలు

<
News November 14, 2025
స్పోర్ట్స్ రౌండప్

⋆ నోయిడాలో నేటి నుంచి వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ టోర్నీ. 51 కేజీల విభాగంలో పోటీ పడనున్న నిఖత్ జరీన్.. బరిలోకి మరో 19 మంది భారత బాక్సర్లు
⋆ చెస్ WC నుంచి ప్రజ్ఞానంద ఔట్.. ప్రీ క్వార్టర్స్‌కు అర్జున్, హరికృష్ణ
⋆ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్: వ్యక్తిగత, టీమ్ కాంపౌండ్ ఈవెంట్స్‌లో ‘గోల్డ్’ సాధించిన జ్యోతి సురేఖ
⋆ నేటి నుంచి ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ క్రికెట్ టోర్నీ.. UAEతో IND-A ఢీ
News November 14, 2025
జూబ్లీహిల్స్ కౌంటింగ్: అభ్యర్థి మృతి

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ వేళ విషాదం నెలకొంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్(40) నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు. ఎర్రగడ్డలో నివాసం ఉండే ఈయన అక్టోబర్ 22న నామినేషన్ వేశారు. ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్‌ను యాక్సెప్ట్ చేయగా పోటీలో నిలిచారు. ఫలితాలకు ఒకరోజు ముందు మహమ్మద్ అన్వర్ మరణించడంతో ఆయన అనుచరులు విషాదంలో మునిగిపోయారు.


