News December 20, 2024
తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పడిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.330 తగ్గి రూ.76,800కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 తగ్గి రూ.70,400గా ఉంది. అటు వెండి ధర కేజీపై రూ.1000 తగ్గి రూ.98,000గా ఉంది.
Similar News
News December 2, 2025
US, UK ఒప్పందం.. ఔషధాలపై ‘0’ టారిఫ్

అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం జరిగింది. UK నుంచి USకు ఎగుమతి అయ్యే ఔషధాలపై సున్నా టారిఫ్‌లు అమలయ్యేలా ఇరుదేశాలు అంగీకారం తెలిపాయి. దీనికి బదులుగా ఔషధాల ఆవిష్కరణలకు అమెరికాలో యూకే 25శాతం అధిక పెట్టుబడులు పెట్టనుంది. దీంతో అక్కడ ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. మూడేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉండనుంది. ఏటా కనీసం 5బిలియన్ డాలర్ల విలువైన UK ఔషధాలు టారిఫ్ లేకుండా USలోకి ఎగుమతి అవుతాయి.
News December 2, 2025
నేడు భౌమ ప్రదోషం.. శివానుగ్రహం కోసం ఈరోజు సాయంత్రం ఏం చేయాలంటే?

త్రయోదశి తిథి, మంగళవారం కలిసి వచ్చిన సందర్భంగా ఈరోజును ‘భౌమ ప్రదోషం’గా పరిగణిస్తారు. ఈ శుభ దినాన సాయంత్రం శివ పార్వతులను పూజిస్తారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్లి, అభిషేకాలు నిర్వహిస్తే.. మనోభీష్టాలు నెరవేరతాయని నమ్మకం. బిల్వ, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు సమర్పించి, ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే విశేష ఫలితాలుంటాయని అంటున్నారు.
News December 2, 2025
నేడు చెన్నైలో IGNITION సదస్సు.. ముఖ్య అతిథిగా KTR

చెన్నైలో ఇవాళ జరిగే శివ్ నాడార్ ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మక ‘IGNITION’ సదస్సులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ‘రిబూటింగ్ ది రిపబ్లిక్’ అనే అంశంపై ప్రసంగిస్తారు. దేశాభివృద్ధిలో రాజకీయాలు, టెక్నాలజీ పాత్ర, ఇన్నోవేషన్ హబ్‌ల ఆవశ్యకత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధిపై తన ఆలోచనలు పంచుకోనున్నారు. నేషనల్ పాలిటిక్స్‌పైనా KTR కీలక వ్యాఖ్యలు చేసే అవకాశముంది.


