News March 22, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గి సామాన్యుడికి కాస్త ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.82,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.89,780కు చేరింది. అటు వెండి ధర ఏకంగా రూ.2000 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,10,000గా ఉంది. కాగా, రెండు రోజుల్లోనే వెండీ ధర ఏకంగా రూ.4100 తగ్గడం విశేషం.

Similar News

News March 22, 2025

డీలిమిటేషన్‌పై వారివి అపోహలే: కిషన్ రెడ్డి

image

TG: డీలిమిటేషన్ ఇంకా ప్రారంభం కాలేదని, కాంగ్రెస్, DMK, BRS మాత్రం ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. BJPపై విషం కక్కడమే వారి ఎజెండా అని విమర్శించారు. ‘డీలిమిటేషన్ పూర్తి కాకుండానే దక్షిణాదికి అన్యాయం అంటూ ప్రచారం చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ కుట్ర చేస్తున్నారు. సౌత్, నార్త్ మధ్య విభజన తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాయి’ అంటూ ఫైర్ అయ్యారు.

News March 22, 2025

వ్యంగ్యంగా మాట్లాడితే కేసులు పెడతారా?: అంబటి

image

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళి హాస్యనటుడు కాబట్టి వ్యంగ్యంగా మాట్లాడారని, అంతమాత్రానికే కేసులు పెడతారా అని YCP నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. మరి దగ్గుబాటి కూడా చంద్రబాబుపై వ్యంగ్యంగా మాట్లాడారు కాబట్టి ఆయనను అరెస్ట్ చేస్తారా అని నిలదీశారు. ‘YCP నేతలపై అక్రమ కేసులు పెట్టిన ఎవరినీ వదిలేది లేదు. మా లీగల్ టీమ్ స్ట్రాంగ్‌గా ఉంది. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా క్షణాల్లో వస్తాం’ అని పేర్కొన్నారు.

News March 22, 2025

ఇన్‌స్టా లైవ్‌లో భర్త ఉరి.. వీడియో చూసినా పట్టించుకోని భార్య

image

మధ్యప్రదేశ్ రేవా(D)లో అమానవీయ ఘటన జరిగింది. భార్య, అత్త వేధింపులు తాళలేక శివ్ ప్రకాశ్(26) అనే యువకుడు ఇన్‌స్టా లైవ్‌లో ఉరివేసుకున్నాడు. అతని భార్య ప్రియాశర్మ 44 ని.లపాటు వీడియో చూస్తున్నా సాయం చేయడానికి ప్రయత్నించలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో భార్య, అత్తను పోలీసులు అరెస్టు చేశారు. ప్రియాశర్మకు ఉన్న వివాహేతర సంబంధం వల్లే భర్తతో విభేదాలు వచ్చాయని, ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు.

error: Content is protected !!