News March 22, 2024
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిన్న <<12896936>>రికార్డు<<>> స్థాయిలో పెరగగా, ఇవాళ అదే స్థాయిలో తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.450 తగ్గి రూ.61,350కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.490 తగ్గడంతో రూ.66,930 పలుకుతోంది. కేజీ వెండి ఏకంగా రూ.2,000 తగ్గి రూ.79,500కు చేరింది.
Similar News
News November 19, 2025
2030 నాటికి కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు

మన దేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(GCC) ద్వారా వచ్చే ఐదేళ్లలో కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ‘GCCల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వీటిలో పని చేసే ఉద్యోగుల సంఖ్య 2026 నాటికి 24 లక్షలకు, 2030 నాటికి 34.6 లక్షలకు చేరుకుంటుంది’ అని NLB సర్వీసెస్ రిపోర్టు వెల్లడించింది. దేశంలో 1800కు పైగా GCCల్లో ఏఐ నిపుణులకు ప్రాధాన్యం లభిస్తోందని తెలిపింది. అత్యధికంగా హైదరాబాద్లో ఈ ఏడాది 41 GCCలు ఏర్పాటయ్యాయి.
News November 19, 2025
ఈ గణపతి రూపం బాధలను పోగొడుతుంది

10 చేతులు, 5 తలలు గల హేరంబ గణపతిని దర్శిస్తే కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఈ గణపతిని ధ్యానించిన తర్వాతే పరమ శివుడు త్రిపురాసురుడుని సంహరించగలిగాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఫలితంగానే స్వర్గంలో ఇంద్రుడు సహా త్రిమూర్తులు తమ స్థానాల్లో ఉండగలిగారట. అందుకే గణపతికి తొలి పూజలు చేస్తారు. ఈయనను కొలిస్తే.. శుభాలు కలుగుతాయని, సంసార సాగరాన్ని సునాయసంగా దాటేయగలరని పండితులు చెబుతున్నారు.
News November 19, 2025
2027 ఆగస్టులో బుల్లెట్ రైలు పరుగులు

దేశంలో 2027 ఆగస్టులో తొలి బుల్లెట్ రైలు ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తొలి దశలో గుజరాత్లోని సూరత్, వాపి మధ్య 100 కి.మీ. మేర నడపనున్నట్లు చెప్పారు. మొత్తం ప్రాజెక్టు 2029లో పూర్తవుతుందని అన్నారు. ముంబై-అహ్మదాబాద్ కారిడార్ అందుబాటులోకి వస్తే 2 గంటల్లోనే జర్నీ పూర్తి అవుతుందని అన్నారు. ఇటీవల ప్రధాని <<18307759>>పర్యటన <<>>తర్వాత అశ్వినీ వైష్ణవ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


