News August 6, 2024

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా తగ్గాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.870 తగ్గి రూ.69,710కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.800 తగ్గి రూ.63,900గా నమోదైంది. సిల్వర్ రేట్ కేజీపై ఏకంగా రూ.3,200 తగ్గి రూ.82,500కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

Similar News

News November 30, 2025

ఈ జిల్లాల ప్రజలు బయటకు రాకండి!

image

AP: దిత్వా తుఫాను భారత్ వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA పేర్కొంది. ‘కోస్తాతీరం వెంబడి గంటకు 45-65 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముంది. NLR, TPT జిల్లాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతేనే బయటికి వెళ్లండి. అత్యవసర సహాయం కోసం నెల్లూరు, కడప, వెంకటగిరిలో NDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయి’ అని తెలిపింది.

News November 30, 2025

HER2-పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసా?

image

బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలామందికి తెలుసుగానీ HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్‌ గురించి చాలామంది మహిళలకి తెలియదు. ఇది సాధారణ రొమ్ము కేన్సర్‌ కంటే ప్రమాదకరమైనది. శరీరంలోని ఇతర భాగాలకు సులభంగా వ్యాపిస్తుంది. HER2-పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్‌ కణ పెరుగుదల, విభజనను ప్రోత్సహించే గ్రాహకమైన HER2 (హ్యూమన్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ 2) ప్రోటీన్ అధికంగా ఉత్పత్తి అవ్వడంతో వస్తుందంటున్నారు నిపుణులు.

News November 30, 2025

HER2-పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స

image

HER2-పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్‌కు టార్గెటెడ్ థెరపీ, కీమోథెరపీ, శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, హార్మోన్ల చికిత్సను వైద్యులు చేస్తారు. అయితే ఇది తగ్గడం అనేది రోగి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. దీనిపై అవగాహన పెంచుకోవడం, ముందుగానే స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవడం వల్ల దీని చికిత్స సులువవుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.