News September 16, 2024
5 రోజుల్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మరింత పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి రూ.160 పెరిగి రూ.75,050కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రూ.150 పెరిగి రూ.68,800 పలుకుతోంది. గత 5 రోజుల్లో ధర ఏకంగా రూ.1750 పెరిగింది. ఇక వెండి ధర కేజీ మరో రూ.1,000 పెరిగి రూ.98వేలకు చేరింది. 5 రోజుల్లో వెండి ధర రూ.6,500 పెరగడం గమనార్హం.
Similar News
News November 25, 2025
డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. మూడు దశల్లో (డిసెంబర్ 11, 14, 17) పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఉ.7 నుంచి మ.1 వరకు పోలింగ్ ఉంటుందని, అదే రోజు 2PM నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 27 నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు.
News November 25, 2025
స్మృతి మంధానను లవర్ పలాశ్ మోసం చేశాడా?

క్రికెటర్ స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ <<18374733>>వివాహం<<>> ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆమె తండ్రికి గుండెపోటు రావడంతో వివాహాన్ని ఆపేసినట్లు ప్రకటించారు. ఇప్పుడు మ్యారేజ్ క్యాన్సిలవ్వడానికి కారణం మరొకటుందని SMలో చర్చ జరుగుతోంది. పలాశ్ వేరే యువతితో చేసిన చాటింగ్ అంటూ కొన్ని స్క్రీన్ షాట్స్ వైరలవుతున్నాయి. అందుకే స్మృతి పెళ్లి రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. ఈ స్క్రీన్ షాట్స్ను అఫీషియల్గా ధ్రువీకరించాల్సి ఉంది.
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77 సమాధానాలు

ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా ఇవ్వమని ఎందుకు అడిగాడు?
జవాబు: ఏకలవ్యుడు మొరుగుతున్న కుక్క నోటిని బాణాలతో కుట్టి, దాన్ని మొరగకుండా చేశాడు. ఈ విలువిద్యను చూసిన ద్రోణుడు అతనికి అస్త్రాలను దుర్వినియోగం చేస్తాడని, విచక్షణా రహితంగా వాడే అవకాశముందని విలువిద్యకు కీలకమైన బొటనవేలుని గురుదక్షిణగా అడిగాడు. అలాగే అర్జునుడికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>


