News January 13, 2025
పెరిగిన బంగారం, వెండి ధరలు
భోగి పండగ వేళ హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.430 పెరిగి రూ.80,070 పలుకుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.400 పెరిగి రూ.73,400కు చేరింది. అటు కేజీ వెండి రూ.1,000 పెరిగి రూ.1,02,000 పలుకుతోంది.
Similar News
News January 13, 2025
జోరుగా కోడి పందేలు
AP: రాష్ట్రవ్యాప్తంగా కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. బరులు ఏర్పాటు చేసి పెద్దఎత్తున పందేలు నిర్వహిస్తున్నారు. ఒక్కో బరి వద్ద కనీసం రూ.20వేల-రూ.30 వేల వరకు పందెం నడుస్తోంది. మొత్తంగా రూ.వందల కోట్లు చేతులు మారుతున్నాయి. మరికొన్ని చోట్ల ఎడ్ల పోటీలు జరుపుతున్నారు. ఈ పందేలు, పోటీలు చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున తరలివస్తున్నారు.
News January 13, 2025
‘డాకు మహారాజ్’ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమా తొలి రోజు రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. బాలకృష్ణకు ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని పేర్కొంది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నిన్న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. తమిళ, హిందీ భాషల్లో ఈనెల 17న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.
News January 13, 2025
రోహిత్ గొప్ప కెప్టెన్: యువరాజ్
రోహిత్ శర్మ ఎప్పటికీ గొప్ప కెప్టెనే అని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నారు. ‘రోహిత్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా వన్డే ప్రపంచకప్ FINALకు వెళ్లింది. టీ20 ప్రపంచకప్ గెలిచింది. ఫామ్ లేమి కారణంగా మ్యాచ్ నుంచి తనకు తానుగా తప్పుకున్న సారథిని నేనిప్పటి వరకు చూడలేదు. తన తొలి ప్రాధాన్యత జట్టేనని రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే అతడి గొప్పతనం’ అని కొనియాడారు.