News October 4, 2025

పెరిగిన బంగారం, వెండి ధరలు

image

వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు రూ.870 పెరిగి రూ.1,19,400కు చేరింది. అటు 22K బంగారం 10 గ్రాములకు రూ.800 పెరిగి రూ.1,09,450 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. వెండి కిలోకి రూ.3 వేలు పెరిగి రూ.1,65,000కు చేరింది.

Similar News

News October 4, 2025

మీ ‘మలం’ మిమ్మల్ని హెచ్చరిస్తుంది!

image

మలం రంగు ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ‘ముదురు రంగు రక్తస్రావాన్ని, ఆకుపచ్చ వేగవంతమైన జీర్ణక్రియను, లేత రంగు కాలేయ సమస్యలను సూచిస్తుంది. మలం తేలియాడుతుంటే అధిక కొవ్వు, గట్టిగా ఉంటే మలబద్ధకం ఉన్నట్టు. నీరుగా ఉంటే అంటువ్యాధులు లేదా ప్రేగుల్లో మంటకు సంకేతం. తీవ్ర వాసన పేలవమైన జీర్ణక్రియను సూచిస్తుంది’ అని తెలిపారు. ఇవి దీర్ఘకాలంగా ఉంటే వైద్యుడ్ని సంప్రదించాలి.

News October 4, 2025

24 గేట్లు ఎత్తి సాగర్ నీటి విడుదల

image

కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్లోకి భారీగా నీరు చేరుతోంది. దీంతో సాగర్‌ 24 ఎత్తి కిందికి నీటిని వదులుతున్నారు. 590 ఫీట్ల సామర్థ్యం కలిగిన జలాశయంలో నీటి మట్టం 587కు చేరుకుంది. కాలువలకూ భారీగా నీటిని వదులుతున్నందున నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోని ప్రజలను ఇరిగేషన్ శాఖ అప్రమత్తం చేసింది. నీటి ఉధృతి వల్ల కాలువల్లో ఈత కొట్టవద్దని సూచించింది.

News October 4, 2025

ఆటో డ్రైవర్ల కోసం కొత్త యాప్: చంద్రబాబు

image

AP: ఉబర్, ర్యాపిడోల పోటీని తట్టుకునేలా ఆటో డ్రైవర్లకు అండగా ఉండేందుకు కొత్త యాప్ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో ఎక్కడ ఉన్నా నేరుగా బుకింగ్స్ డ్రైవర్లకు వెళ్తాయని చెప్పారు. 24 గంటలు ఆటో స్టాండ్‌లో ఉండే పనిలేకుండా చేస్తామన్నారు. అవసరమైతే ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు తీసుకొస్తామన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, యాప్ నిర్వహణ డ్రైవర్లు చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.