News October 26, 2024

దీపావళికి 20% తగ్గనున్న గోల్డ్ డిమాండ్.. ఎందుకంటే!

image

గత ఏడాదితో పోలిస్తే ఈ దీపావళి, ధంతేరాస్‌కు గోల్డ్ డిమాండ్ 15-20% తగ్గుతుందని జువెలర్స్ అంచనా వేస్తున్నారు. ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు కారణమన్నారు. దాదాపుగా వీరి వార్షిక అమ్మకాల్లో 30-40% ఈ సీజన్లోనే నమోదవుతుంది. అందుకే కస్టమర్లను ఆకర్షించేందుకు ఎలక్ట్రిక్ కార్లు, SUVలు, ఐఫోన్ 16, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ రేట్ ప్రొటెక్షన్ స్కీములను ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం గోల్డ్ 10grams ధర రూ.81వేలుగా ఉంది.

Similar News

News October 26, 2024

కోహ్లీ ఔట్

image

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో గట్టెక్కేందుకు భారత్‌ ఆశలు పెట్టుకున్న కోహ్లీ కూడా ఔట్ అయ్యారు. 17 రన్స్ వద్ద సాంట్నర్ బౌలింగ్‌లో LBWగా వెనుదిరిగారు. దీంతో భారత్ 147 పరుగులకే 5 ప్రధాన వికెట్లు కోల్పోయింది. క్రీజులో సుందర్, సర్ఫరాజ్ ఉన్నారు. విజయానికి ఇంకా 212 రన్స్ కావాలి.

News October 26, 2024

డిప్యూటీ సీఎంను కలిసిన JAC నేతలు

image

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఉద్యోగ సంఘాల JAC నేతలు కలిశారు. 2 DAలు, పెండింగ్ బిల్లులు సహా మరికొన్ని అంశాలను పరిష్కరించాలని కోరారు. ఇవాళ జరిగే క్యాబినెట్ భేటీలో వీటిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని భట్టి వారికి చెప్పారు.

News October 26, 2024

BREAKING: కష్టాల్లో భారత్

image

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. 359 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత జట్టులో రోహిత్(8) వికెట్ త్వరగానే కోల్పోగా, గిల్(23), జైశ్వాల్(77) జోడీ స్కోరు బోర్డును కాసేపు పరుగులు పెట్టించారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే ఇద్దరూ ఔట్ కాగా, ఆ కాసేపటికే పంత్(0) కూడా రనౌట్ అయ్యారు. ప్రస్తుతం కోహ్లీ(14), సుందర్(3) ఆడుతున్నారు. భారత్ గెలవాలంటే ఇంకా 225 రన్స్ చేయాలి.