News May 20, 2024
ఏషియన్ రిలే ఛాంపియన్షిప్స్లో భారత్కు గోల్డ్

TG: ఏషియన్ రిలే ఛాంపియన్షిప్స్లో భారత్ సత్తా చాటింది. 4*400 మిక్స్డ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. అయితే కొద్ది తేడాలో పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్కు అర్హత సాధించలేకపోయింది. ముహమ్మద్ అజ్మల్, జ్యోతిక, అమోజ్ జాకబ్, సుభ వెంకటేశన్ బృందం 3 నిమిషాల 14.12 సెకండ్లలో రేసును పూర్తి చేయడం గమనార్హం. ఈ విభాగంలో భారత్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఆ తర్వాత స్థానాల్లో శ్రీలంక, వియత్నాం నిలిచాయి.
Similar News
News November 16, 2025
NLG: అంగన్వాడీల భర్తీ ఎప్పుడు..?!

మహిళా, శిశు సంరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్, ఆయా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్గొండ జిల్లాలో 150 టీచర్ పోస్టులు, 684 ఆయా పోస్టులు, సూర్యాపేట జిల్లాలో 85 టీచర్, 290 ఆయాలు, యాదాద్రి జిల్లాలో 266 టీచర్, 58 ఆయా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.
News November 16, 2025
APPLY NOW: MECLలో ఉద్యోగాలు

మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (<
News November 16, 2025
వేదాలను ఎందుకు అధ్యయనం చేయాలి?

వేదాలు అమూల్య రత్నాలు గల మహాసముద్రాల కంటే లోతైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. అందుకే వాటిని అధ్యయనం చేయాలి. వీటిలో విశ్వ రహస్యాలు, సైంటిఫిక్ విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇవి ఇహ, పరలోకాల్లో శాశ్వత ఆనందాన్ని, సుఖాలను అందించే మార్గాన్ని చూపుతాయి. సామాన్య మానవుడిని పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. మన జీవితాన్ని ఉన్నతంగా, సంతోషంగా మార్చుకోవడానికి, సృష్టి రహస్యాలు తెలుసుకోవడానికి వేదాలు చదవాలి. <<-se>>#VedikVibes<<>>


