News December 31, 2024
2025లో రూ.90వేలకు బంగారం!

న్యూఇయర్‌లో GOLD రికార్డు గరిష్ఠాలకు చేరుకుంటుందని నిపుణుల అంచనా. జియో పొలిటికల్ టెన్షన్స్, యుద్ధాలు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు కొనసాగితే 10 గ్రాముల ధర రూ.90,000ను తాకుతుందని అంటున్నారు. కనీసం రూ.85వేలను అందుకోవచ్చని పేర్కొంటున్నారు. ఇక కిలో వెండి రూ.1.10 లక్షలు, దూకుడు కొనసాగితే రూ.1.25లక్షలకు చేరుకోవచ్చని చెప్తున్నారు. అనిశ్చితి, యుద్ధాలు లేకుంటే బలహీనత కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
Similar News
News December 3, 2025
ఇండిగోలో సిబ్బంది కొరత.. పలు ఫ్లైట్లు ఆలస్యం, రద్దు

సిబ్బంది కొరతతో పలు ఇండిగో విమాన సర్వీసులు లేట్‌గా నడుస్తుండగా, కొన్ని రద్దవుతున్నాయి. మంగళవారం 35% ఫ్లైట్లు మాత్రమే సమయానికి నడిచినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం వరకు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు తదితర విమానాశ్రయాల నుంచి బయలుదేరాల్సిన 200 సర్వీసులు రద్దయ్యాయి. నవంబర్‌లో ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇండిగోలో పైలట్లు, ఫ్లైట్ సిబ్బంది కొరత ఎదుర్కొంటోంది.
News December 3, 2025
రూ.3.30 నుంచి రూ.90 వరకు.. రూపాయి పతనం ఇలా!

స్వాతంత్య్రం(1947) వచ్చేనాటికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ.3.30 ఉండేది. 30 సంవత్సరాల తర్వాత..
☛ 1977లో అది రూ.8.434కు చేరింది
☛ తరువాతి 30 ఏళ్ల(2007)కు 43.595గా ఉంది
☛ 2020లో రూ.73.23, 2021లో రూ.74.56, 2022లో రూ.82.76, 2023లో 83.4
☛ 2024లో 83.28కు బలహీనపడింది
☛ తాజాగా 2025 డిసెంబర్ నాటికి 90 రూపాయలకు పతనమైంది.
News December 3, 2025
భారీ ఎన్కౌంటర్.. 15 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా దంతెవాడ అడవుల్లో జరిగిన భారీ <<18458130>>ఎన్కౌంటర్లో<<>> మృతుల సంఖ్య పెరిగింది. ఎదురుకాల్పుల్లో 12 మంది మావోలు మరణించగా ముగ్గురు పోలీసులు అమరులయ్యారు. ఘటనాస్థలం నుంచి మావోలకు సంబంధించిన భారీ ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు జనవరి 1న అంతా లొంగిపోతామని ఇటీవల అభయ్ పేరిట మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.


