News July 29, 2024
మలద్వారంలో దాచిన బంగారం.. ఈ వార్తలకు చెక్ పడ్డట్టే!

మలద్వారంలో దాచిన బంగారం కడ్డీలను పట్టేసిన అధికారులు… ఇకపై ఇలాంటి న్యూస్ రాకపోవచ్చు. కస్టమ్స్ సుంకం 6 శాతానికి తగ్గడంతో స్మగ్లింగ్ తగ్గిపోతుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. ధర తక్కువని దుబాయ్, UAE నుంచి కొందరు గోల్డ్ అక్రమ రవాణాకు ప్రయత్నించేవాళ్లు. చివరికి విమాన, నౌకాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులకు చిక్కేవాళ్లు. ఇప్పుడు భారత్లోనే ధర తగ్గడంతో ఈ ఘటనలు ఆగిపోవచ్చు. కస్టమ్స్ వారికీ శ్రమ తగ్గొచ్చు.
Similar News
News November 21, 2025
ఇతిహాసాలు క్విజ్ – 73 సమాధానాలు

సమాధానం: పంచ పాండవుల ప్రాణాలు తీసే శక్తి కలిగిన 5 బాణాలను భీష్ముడి నుంచి దుర్యోధనుడు తీసుకుంటాడు. దివ్య దృష్టితో ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడికి పూర్వం అర్జునుడికి, దుర్యోధనుడు వరమిచ్చిన విషయం గుర్తుకు వస్తుంది. దీంతో ఆయన అర్జునుడిని, దుర్యోధనుడి వద్దకు పంపి ఆ బాణాలు కావాలనే వరం కోరమని చెబుతాడు. ఇచ్చిన వరం కారణంగా, మాట తప్పకూడదు కాబట్టి దుర్యోధనుడు వాటిని అర్జునుడికి ఇచ్చేస్తాడు. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 21, 2025
పదో తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

AP: టెన్త్ <
News November 21, 2025
అమల్లోకి కొత్త లేబర్ కోడ్స్

కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లు నేడు అమల్లోకి వచ్చాయి. వీటిలో కోడ్ ఆన్ వేజెస్(2019), ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్(2020), కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ(2020), ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్(2020) ఉన్నాయి. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది.


