News December 1, 2024

50 శాతం పెరిగిన గోల్డ్ రుణాలు.. తగ్గిన పర్సనల్ లోన్స్

image

FY2025 తొలి 7 నెలల్లో గోల్డ్ లోన్స్ 50 శాతం పెరిగాయని RBI వెల్లడించింది. ఈ ఏడాది మార్చిలో రూ.1.05 లక్షల కోట్ల రుణాలు ఉండగా, అక్టోబర్ 18 నాటికి రూ.1.54 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపింది. ఇదే సమయంలో గృహ రుణాలు కూడా 12.1 శాతం పెరిగాయని పేర్కొంది. అయితే వ్యక్తిగత రుణాలు 3.3 శాతం తగ్గాయంది. మొత్తంగా అన్ని రకాల రుణాలు 4.9 శాతం అధికమై రూ.172 లక్షల కోట్లకు చేరుకున్నట్లు వివరించింది.

Similar News

News March 10, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 10, 2026

అనిల్ రావిపూడి నుంచి యానిమేషన్ మూవీ?

image

కమర్షియల్ సినిమాలతో వరుస హిట్లు అందుకుంటున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి కొత్త జానర్‌లో మూవీ తీసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. లార్జ్ స్కేల్ యానిమేషన్ ప్రాజెక్టుపై ఆయన పనిచేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. KVN ప్రొడక్షన్స్ నిర్మించే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు ఇంకా చాలా టైమ్ పడుతుందని పేర్కొన్నాయి. కాగా ప్రస్తుతం వెంకటేశ్, కళ్యాణ్ రామ్‌తో అనిల్ ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు.

News March 10, 2026

ఈరోజు నమాజ్ వేళలు (10-3-2026) మంగళవారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.16 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.29 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.25 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.