News August 10, 2024
గోల్డ్ మెడల్ సాధించిన ఖెలీఫ్.. తాను అమ్మాయినేనని స్పష్టీకరణ

ఒలింపిక్స్‌లో జెండర్ <<13757365>>వివాదానికి<<>> కారణమైన అల్జీరియా బాక్సర్ ఇమానే ఖెలీఫ్ ఫైనల్(66KG)లో యాంగ్ లీ(చైనా)పై 5-0 తేడాతో గెలిచి గోల్డ్ మెడల్ సాధించారు. అనంతరం తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. ‘ఇతర అమ్మాయిల మాదిరి నేను కూడా స్త్రీనే. అమ్మాయిగానే పుట్టి, పెరిగా. ఇప్పుడు ఉమెన్స్ విభాగంలోనే పోటీ పడి గెలిచా. ఎనిమిదేళ్లుగా పడిన కష్టానికి ఫలితం లభించింది’ అని ఆనందం వ్యక్తం చేశారు.
Similar News
News April 4, 2026
ఖాళీ కడుపుతో మద్యం తాగితే..

మద్యం ప్రియులు కొన్ని చిట్కాలతో ఆల్కహాల్ దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చని ఎక్స్‌పర్టులు సూచిస్తున్నారు. ‘బింజ్ డ్రింకింగ్(తక్కువ సమయంలో ఎక్కువ తాగడం) మానుకోవాలి. తాగేటప్పుడు స్మోక్/వేప్ చేయొద్దు. ఖాళీ కడుపుతో లిక్కర్ తీసుకోవద్దు. 2లేదా అంతకన్నా ఎక్కువ డ్రింక్స్ కలపొద్దు. వీటి వల్ల హ్యాంగోవర్, ఇతర ఆరోగ్య సమస్యలొస్తాయి. కాలేయంలో అసిటాల్డిహైడ్ అనే క్యాన్సర్ కారక టాక్సిన్ ఏర్పడుతుంది’ అని అంటున్నారు.
News April 4, 2026
ఒక లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180.. వైరల్

ఎండల కారణంగా కొబ్బరి నీళ్లకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు రేట్లను భారీగా పెంచారు. బోండాలను కాకుండా లీటర్ల రూపంలో అమ్మడం అధికమైంది. బెంగళూరులో లీటర్ కోకోనట్ వాటర్ ₹180 అంటూ వెలసిన బోర్డులు వైరలవుతున్నాయి. HYD, విజయవాడ, విశాఖలోనూ లీటర్ రేటు ₹120-140గా ఉంది. మీ ప్రాంతంలో రేటు ఎలా ఉంది?