News April 14, 2025
5 రోజుల తర్వాత తగ్గిన బంగారం ధర

రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు 5 రోజుల తర్వాత స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 తగ్గి రూ.87,550కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 తగ్గి రూ.95,510 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.1,09,900గా ఉంది.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్‌సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్‌తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


