News March 28, 2025
ఏడాదిలో రూ.23,730 పెరిగిన గోల్డ్ ధర

దేశంలో బంగారం ధర ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. గత ఏడాది ఏప్రిల్ 1న ఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్ రేటు(24 క్యారెట్లు) రూ.68,420 ఉండగా, ఇవాళ రూ.92,150కి చేరింది. ఏడాదిలో ఏకంగా రూ.23,730 పెరిగింది. <<15912228>>హైదరాబాద్లోనూ<<>> స్వచ్ఛమైన పసిడి ధర రూ.90,980 పలుకుతోంది. అంతర్జాతీయ ట్రేడ్ వార్స్ కారణంగా వృద్ధికి ఆటంకం కలుగుతుందనే ఆందోళనలు బంగారానికి డిమాండ్ పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News March 31, 2025
భూకంపం.. మసీదులు కూలి 700 మంది మృతి

గత శుక్రవారం మయన్మార్లో వచ్చిన భూకంపానికి మసీదులు కూలి ప్రార్థనలు చేస్తున్న 700 మందికి పైగా మరణించారని ఓ ముస్లిం సంఘ ప్రతినిధులు వెల్లడించారు. 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపానికి సుమారు 60 మసీదులు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పాత మసీదు భవనాలపై ఎక్కువ ప్రభావం పడిందని వివరించారు. కాగా, ఆ దేశంలో మొత్తం భూకంపం మృతుల సంఖ్య 1700 దాటింది.
News March 31, 2025
తిరుమల శ్రీవారికి నిద్ర లేకుండా చేస్తున్నారు: రోజా

AP: కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, తిరుమల శ్రీవారికీ నిద్ర లేకుండా పోతోందని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ‘సంప్రదాయాల ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. ప్రస్తుతం రోజుకు దాదాపు 10వేల VIP బ్రేక్ దర్శనాలకు ప్రాధాన్యమిస్తూ స్వామికి నిద్ర లేకుండా చేస్తున్నారు. మరోవైపు సాధారణ భక్తుల దర్శనాలను తగ్గించారు. ఇదేనా పవన్, BJPల సనాతన ధర్మం?, ఇదేనా చంద్రబాబు నమూనా ప్రక్షాళన?’ అని ప్రశ్నించారు.
News March 31, 2025
ORRపై టోల్ ఛార్జీల పెంపు

TG: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై టోల్ ఛార్జీలను పెంచేశారు. రేపటి నుంచి ఇవి అమలులోకి రానున్నాయి. కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వాహనాలకు KMకు 10 పైసలు, మినీ బస్, ఎల్సీవీలకు KMకు 20 పైసలు, 2 యాక్సిల్ బస్సులకు 31 పైసలు, భారీ వాహనాలకు 69 పైసల చొప్పున పెంచింది. ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ ఈ ఛార్జీలను వసూలు చేస్తోంది.