News October 20, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

దీపావళి వేళ బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గి ₹1,30,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150 పతనమై రూ.1,198,00గా ఉంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ వెండి ధర రూ.1,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

Similar News

News October 20, 2025

వనపర్తి: ఉచిత గిఫ్ట్ కోసం ఆశ పడొద్దు: SP

image

పండగ పేరిట ఉచిత గిఫ్టులు, రివార్డులు అంటూ సైబర్ నేరగాళ్లు పంపే లింకులు, ఏపీకే ఫైల్స్‌పై క్లిక్ చేయవద్దని వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ హెచ్చరించారు. ఎన్ఆర్ఐల పేరుతో మోసం చేసి, కస్టమ్స్ డ్యూటీ పేరుతో డబ్బులు వసూలు చేస్తారన్నారు. ఉచిత గిఫ్టుల కోసం ప్రజలు ఆశపడకుండా, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కోరారు.

News October 20, 2025

మెరిసే చర్మం కోసం ఈ ఫేస్ ప్యాక్‌లు

image

అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. దీనికోసం ఇంట్లోనే ఉండే కొన్నిపదార్థాలతో ఈ ప్యాక్స్ ట్రై చేసి చూడండి. * పెరుగు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు ఉంచి మెల్లగా మసాజ్ చేస్తూ కడిగేయాలి. దీంతో ముఖానికి మంచి గ్లో వస్తుంది. * పసుపు, గంధం, పాలు, రోజ్ వాటర్ కలిపి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ వారానికి రెండుసార్లు వేస్తే ముఖం అందంగా మెరిసిపోతుంది.

News October 20, 2025

కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్.. కథ ముగిసింది

image

TG: నిజామాబాద్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన రియాజ్ బుల్లెట్ బైకులను చోరీ చేయడంలో దిట్ట అని పోలీసులు వెల్లడించారు. ఇతడిపై 60కి పైగా కేసులున్నాయి. శుక్రవారం కానిస్టేబుల్ ప్రమోద్ ఇతడిని పట్టుకుని బైకుపై తీసుకెళ్తుండగా కత్తితో పొడిచి చంపి పారిపోయాడు. నిన్న పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఆ క్రమంలో గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఇవాళ గన్ తీసుకుని పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయాడు.