News July 7, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹540 తగ్గి ₹98,290కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹500 తగ్గి ₹90,100 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేట్ రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

Similar News

News July 7, 2025

రాష్ట్రంలో క్రీడా పోటీలు నిర్వహించండి: CM రేవంత్

image

ఢిల్లీ పర్యటనలో ఉన్న TG CM రేవంత్ కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఖేలో ఇండియా, జాతీయ, అంతర్జాతీయ తదితర ఈవెంట్లు నిర్వహించాలని కోరారు. ఖేలో ఇండియా స్కీమ్ కింద అథ్లెట్లకు ట్రైనింగ్, మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనే అథ్లెట్లకు రైల్వే టికెట్లలో రాయితీని పునరుద్ధరించాలని సీఎం ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

News July 7, 2025

నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయి: హరీశ్ రావు

image

TG: రేవంత్ పాలనలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ‘20 నెలలుగా రాష్ట్రంలో పాలన కుంటుపడింది. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా AP నీటిని తరలించుకుపోతోంది. కానీ ఇక్కడి కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి నీటిని వాడుకోవడం రేవంత్‌కు చేతకావట్లేదు. కాంగ్రెస్ సర్కారు గురించి ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది’ అని అన్నారు.

News July 7, 2025

మస్క్ కొత్త పార్టీ.. పడిపోయిన టెస్లా షేర్లు

image

బిలియనీర్ ఎలాన్ మస్క్ USలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించడంతో ఇవాళ ప్రీమార్కెట్లో టెస్లా షేర్లు 7% పడిపోయాయి. మస్క్ నిర్ణయంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత వారాంతంలో $315.35 వద్ద ముగిసిన షేరు ధర తాజాగా $291.96కు పడిపోయింది. ఈ ట్రెండ్ కొనసాగితే సంస్థకు భారీ నష్టాలు తప్పవు. టెస్లా షేర్లు గత ఐదేళ్లలో ఇన్వెస్టర్లకు 206%కు పైగా లాభాలను తెచ్చిపెట్టడం గమనార్హం.