News February 27, 2025
తగ్గిన బంగారం ధరలు

కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు ఈరోజు తగ్గి కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.80,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.87,380కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,06,000గా ఉంది.
Similar News
News November 27, 2025
స్మృతి మంధానకు మద్దతుగా నిలిచిన జెమీమా

తండ్రి అనారోగ్యంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న స్మృతి మంధాన కోసం తోటి క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్మృతి ఫ్యామిలీకి మద్దతుగా నిలిచేందుకు బిగ్ బాష్ లీగ్ మిగతా మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఆమె ప్రాతినిధ్యం వహించే బ్రిస్బేన్ హీట్ ఈ విషయం వెల్లడించింది. స్మృతి పెళ్లి కోసం జెమీమా ఇండియాకు వచ్చారని, పెళ్లి ఆగిపోవడంతో ఫ్రెండ్‌కు సపోర్ట్ కోసం ఇక్కడే ఉంటానని తెలిపారని పేర్కొంది.
News November 27, 2025
NIT వరంగల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

<
News November 27, 2025
పంచాయతీ ఎన్నికలు.. జీవో నం.46 అంటే ఏంటి?

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 22న జీవో నం.46ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి గరిష్ఠంగా 50 శాతం మించకూడదు. దీని ప్రకారం బీసీలకు 22% రిజర్వేషన్లు మాత్రమే దక్కుతాయని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవోను <<18402975>>సవాల్ చేస్తూ హైకోర్టులో<<>> పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరగనుంది.


