News February 28, 2025
మళ్లీ తగ్గిన బంగారం ధరలు

వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గి శుభకార్యాల వేళ సామాన్యుడికి ఉపశమనం కలిగించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.500 తగ్గి రూ.79,600లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.540 తగ్గడంతో రూ.86,840కు చేరింది. అటు వెండి ధర కూడా కేజీపై రూ.1000 తగ్గి రూ.1,05,000గా ఉంది.
Similar News
News January 11, 2026
ఇరాన్ స్వేచ్ఛ కోరుకుంటోంది: ట్రంప్

ఇరాన్లో తీవ్ర <<18730445>>నిరసనలు<<>> కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రజలు ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతగా స్వేచ్ఛను కోరుకుంటున్నారని, వారికి సాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆర్థిక సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. నిరసనకారులను అణచివేయాలని ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తే USA చూస్తూ ఊరుకోదని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు.
News January 11, 2026
సంక్రాంతి సందడి.. హోటళ్లు హౌస్ఫుల్

AP: గోదావరి జిల్లాల్లో సందడి సంక్రాంతి మొదలైంది. భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, కాకినాడ, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో హోటళ్లు, లాడ్జిలు హౌస్ఫుల్ అయిపోయాయి. కోడిపందేల కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి జనం తరలివస్తున్నారు. పందేల బరులు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. హోటల్ యజమానులు గదుల అద్దెను మూడు రోజులకు రూ.30-60 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
News January 11, 2026
తలనొప్పితో బాధపడుతున్నారా?

తరచూ తలనొప్పి వస్తుంటే దానికి ప్రధాన కారణం మన రోజువారీ అలవాట్లేేనని నిపుణులు అంటున్నారు. మార్నింగ్ టిఫిన్ దాటవేయడం, ఎక్కువసేపు ఆకలితో ఉండటం దీనికి ముఖ్య కారణాలు. అలాగే ఒత్తిడితో కూడిన జీవనశైలి వలన మెడ, తల కండరాలు బిగుసుకుపోయి నొప్పి వస్తుంది. తగినంత నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడి అకస్మాత్తుగా తలనొప్పి వస్తుంది. బరువు తగ్గాలనే ఉద్దేశంతో సరిగ్గా తినకపోయినా, నిద్ర లేకపోయినా ఈ సమస్య వస్తుంది.


