News April 5, 2025
రెండో రోజూ భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా తగ్గి సామాన్యుడికి కాస్త ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి నేడు ₹980 తగ్గి ₹90,660కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ ₹900 తగ్గి ₹83,100గా పలుకుతోంది. అటు వెండి ధర కూడా రూ.5000 తగ్గడంతో కేజీ రూ.1,03,000కి చేరింది. కాగా, రెండ్రోజుల్లో తులం బంగారం రేటు రూ.2720 తగ్గడం విశేషం.
Similar News
News January 5, 2026
వంటింటి చిట్కాలు

* పసుపు, కారం, కరివేపాకు పొడిలాంటివి నిల్వ చేసేటప్పుడు చిటికెడు ఇంగువ కలిపి పేపరు కవర్లలో భద్రం చేస్తే ఏడాదిపాటు నిల్వ ఉంటాయి.
* బ్రెడ్ ప్యాకెట్లో బంగాళాదుంప ముక్కలు ఉంచితే ఆ బ్రెడ్ తొందరగా పాడవదు.
* ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటి వాటిని కట్ చేసినపుడు చేతులకు వాటి వాసన పోదు. అప్పుడు చేతిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుని కొంచెంసేపు శుభ్రంగా రుద్దికడిగితే వాసనలు పోతాయి.
News January 5, 2026
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. పాలకొల్లు దంపతులు మృతి

USలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో APలోని పాలకొల్లుకు చెందిన దంపతులు మరణించారు. వాషింగ్టన్లో పదేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న కొటికలపూడి కృష్ణకిశోర్(45), ఆయన భార్య ఆశ కన్నా(40) పిల్లలతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ మరణించగా వారి కుమారుడు, కూతురు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణకిశోర్ కుటుంబం 10 రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చి వెళ్లింది.
News January 5, 2026
కలుషిత నీరు.. 17కి చేరిన మరణాలు

ఇండోర్ భగీరథ్పురలో <<18729199>>కలుషిత నీరు<<>> తాగి మరణించిన వారి సంఖ్య 17కి పెరిగింది. తాజాగా ఓం ప్రకాశ్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మృతిచెందారు. ఇప్పటివరకు 398 మంది ఆస్పత్రిలో చేరగా 256 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం రేపు కోర్టులో నివేదిక ఇవ్వనుంది. మంచినీటి పైప్ లైన్లో మురుగునీరు కలవడమే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం అక్కడి ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.


