News March 11, 2025
తగ్గిన బంగారం ధరలు!

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు కాస్త తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.300 తగ్గి రూ.80,200లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 తగ్గడంతో రూ.87,490కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.1000 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.
Similar News
News March 5, 2026
హోటల్‌లో మహిళకు పాక్ క్రికెటర్ వేధింపులు!

T20WCలో పేలవ ప్రదర్శనతో నిరాశలో ఉన్న PAK జట్టును ఓ వివాదం చుట్టుకుంది. SLతో జరిగిన సూపర్8 మ్యాచ్‌కు ముందు హోటల్ హౌస్ కీపింగ్ మహిళతో ఓ PAK ప్లేయర్ అనుచితంగా ప్రవర్తించగా ఆమె కేకలు వేసినట్లు NDTV పేర్కొంది. దీంతో హోటల్ సిబ్బంది ఆమెను రక్షించి జట్టు మేనేజర్ నవైద్‌కు ఫిర్యాదు చేయగా ఆయన ప్లేయర్ తరఫున సారీ చెప్పినట్లు వివరించింది. ఆ ప్లేయర్‌కు ఫైన్ వేసినట్లు త్వరలో PCB ముందు విచారణకు వెళ్తారని సమాచారం.
News March 5, 2026
ట్రంప్ హత్యకు ఇరాన్ ప్లాన్? సంచలన ఆరోపణలు!

US పొలిటికల్ లీడర్ల హత్యకు కుట్ర చేశాడన్న ఆరోపణలపై 2024లో అరెస్టయిన పాక్ వ్యక్తి ఆసిఫ్ మర్చంట్ బ్రూక్లిన్ సంచలన విషయం బయటపెట్టాడు. ట్రంప్, బైడెన్, నిక్కీ హేలీని చంపేందుకు Iran ఇంటెలిజెన్స్ తనను నియమించుకున్నట్లు తాజాగా కోర్టుకు తెలిపాడు. ఫ్యామిలీని చంపేస్తామని బెదిరించడంతో వారికి సహకరించానన్నాడు. 2024 JUNEలో రిపబ్లికన్ లీడర్ హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు అనుమానించి ఆసిఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
News March 5, 2026
అప్పుడు తగ్గింది ఇప్పుడు నెగ్గడానికేనా?

గతేడాది నవంబర్‌లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో BJP-JDU కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 243 సీట్లలో BJP 89, JDU 85 చోట్ల గెలిచాయి. మెజార్టీ స్థానాలు దక్కినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాషాయ పార్టీ నితీశ్‌కే సీఎం పదవి ఇచ్చింది. అయితే BJP అప్పుడు వెనక్కి తగ్గింది ఇప్పుడు సీఎం పదవి చేజిక్కించుకొని, రాష్ట్ర రాజకీయాలను శాసించడానికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?


