News May 24, 2024

భారీగా తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.900 తగ్గి రూ.66,400కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.980 తగ్గడంతో రూ.72,440 పలుకుతోంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.500 తగ్గి రూ.96,500కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.

Similar News

News November 22, 2025

జల, వాయు మార్గాల ద్వారా భారత్-అఫ్గాన్ ట్రేడ్

image

భారత్-అఫ్గాన్ మధ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయి. పాక్ రోడ్డు మార్గం మూసేయడంతో జల, వాయు మార్గాల ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవుతోపాటు రెండు ప్రత్యేక కార్గో విమానాలను ఉపయోగించుకోనున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. ప్రస్తుతం IND-AFG మధ్య బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుండగా, భవిష్యత్తులో మరింత పెంచనున్నాయి.

News November 22, 2025

పత్తి రైతుకు దక్కని మద్దతు ధర

image

మద్దతు ధర విషయంలో పత్తి రైతులకు కష్టాలు తప్పడం లేదు. క్వింటా పత్తి పొట్టి పింజ రూ.7,710, పొడవు పింజ రూ.8110 మద్దతు ధరగా ప్రకటించినా.. నిబంధనల వల్ల ఆ ధర దక్కే పరిస్థితి కనిపించడం లేదు. తేమ ఉందని, రంగు మారిందని కొనుగోలు కేంద్రాల్లో తక్కువ ధరే ఇస్తున్నారు. గ్రామాల్లో కొందరు వ్యాపారులు క్వింటా పత్తిని రూ.5వేలు నుంచి రూ.6వేలకే అడుగుతున్నారు. దీంతో తమకు పెట్టుబడి కూడా దక్కట్లేదని రైతులు వాపోతున్నారు.

News November 22, 2025

శుక్ర మౌఢ్యమి.. 83 రోజులు ఈ శుభకార్యాలు చేయొద్దు: పండితులు

image

ఈ నెల 26 నుంచి వచ్చే ఏడాది FEB 17 వరకు(83 రోజులు) శుక్ర మౌఢ్యమి ఉందని పండితులు వేదస్మార్త గురురాజుశర్మ తెలిపారు. ‘శుభాలకు అధిపతులైన గురు, శుక్రుడు ఈ మూఢాల్లో సూర్యుడికి సమీపంగా రావడంతో శక్తిని కోల్పోతాయి. ఈ రోజుల్లో వివాహం, గృహప్రవేశాలు, వాహనాల కొనుగోళ్లు, బోర్లు తవ్వించడం, పుట్టువెంట్రుకలు తీయడం, యాత్రలకు వెళ్లడం వంటివి చేయొద్దు. నిత్యారాధన, సీమంతాలకు ఈ దోషం వర్తించదు’ అని పేర్కొన్నారు.