News October 28, 2025
భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ గంటల వ్యవధిలోనే <<18126051>>రెండోసారి<<>> గోల్డ్ రేట్స్ తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24క్యారెట్ల 10గ్రా.ల బంగారంపై రూ.2460 తగ్గి రూ.1,20,820కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,250 పతనమై రూ.1,10,750గా ఉంది. అటు కేజీ వెండిపై ఇవాళ రూ.5వేలు తగ్గడంతో రూ.1,65,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News October 28, 2025
సర్జరీ విజయవంతం.. కోలుకున్న శ్రేయస్!

భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకున్నారని Cricbuzz తెలిపింది. Spleen(ప్లీహం)కు గాయం కాగా సిడ్నీ వైద్యులు మైనర్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారని చెప్పింది. నిన్ననే ICU నుంచి బయటికొచ్చిన అయ్యర్ మరో 5 నుంచి 7 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పినట్లు పేర్కొంది. ఇదే నిజమైతే అతడు త్వరలో మైదానంలో అడుగుపెట్టే ఛాన్సుంది.
News October 28, 2025
ఆ వ్యాయామాలతో బ్రెస్ట్ క్యాన్సర్ కట్టడి

మహిళల్లో వేగంగా విస్తరిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను 30 శాతం వరకూ తగ్గించడంలో రెసిస్టెన్స్ ట్రైనింగ్, హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వ్యాయామాలు పనిచేస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ వ్యాయామాల వల్ల మయోకిన్స్ రిలీజై రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను 30 శాతం వరకు నెమ్మదిస్తుందని తేలింది.
News October 28, 2025
ఇతిహాసాలు క్విజ్ – 49 సమాధానాలు

1. శ్రీరామదాసుగా ప్రసిద్ధి చెందిన భక్తుడు ‘కంచర్ల గోపన్న’.
2. భూలోకానికి పైన ఉండే మొదటి లోకం ‘భువర్లోకం’.
3. రామసేతు నిర్మాణంలో ప్రధాన ఇంజినీర్లు ‘నల-నీల’ అనే ఇద్దరు వానరులు.
4. యుద్ధాన్ని చూస్తూ దాన్ని ధృతరాష్ట్రునికి వివరించింది ‘సంజయుడు’.
5. శివుడు తన జటాజూటంలో బంధించిన నది ‘గంగ’.
<<-se>>#Ithihasaluquiz<<>>


