News October 30, 2025
భారీగా తగ్గిన బంగారం ధరలు!

నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గి కొనుగోలుదారులకు కాస్త ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,910 తగ్గి రూ.1,20,490కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,750 పతనమై రూ. 1,10,450గా ఉంది. అటు కేజీ వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News October 30, 2025
12NHలపై EV ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం

TG: రాష్ట్రంలోని 12 నేషనల్ హైవేస్‌పై ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు రానున్నాయి. PM e-డ్రైవ్ పథకం కింద NHA 13 రూట్లలోని ప్రాంతాలను ప్రతిపాదించగా కేంద్రం 12 స్టేషన్లను ఆమోదించింది. NH44(ఆదిలాబాద్-మహబూబ్ నగర్), NH65 (జహీరాబాద్-కోదాడ), NH163 (వికారాబాద్-ములుగు), NH765 (హైదరాబాద్-దిండి) ఇందులో ఉన్నాయి. NH150 (సంగారెడ్డి)ని మినహాయించారు. స్టేషన్లు ఏర్పాటుపై రాయితీలు ఇస్తారు.
News October 30, 2025
రేపు స్కూళ్లకు సెలవు ఉంటుందా?

తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. APలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని వరంగల్, హనుమకొండ, కరీంనగర్, సిద్దిపేట, జనగామ జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రభావం తగ్గలేదు. దీంతో రేపు కూడా స్కూళ్లకు సెలవు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
News October 30, 2025
నేడు ఈ చెట్టు కింద భోజనం చేస్తే..

నేడు కార్తీక శుద్ధ నవమి. విష్ణువు కూష్మాండుడు అనే రాక్షసుడిని ఇదే రోజు సంహరించాడని పురాణాల వాక్కు. అందుకే కూష్మాండ నవమి అని కూడా అంటారు. ఈ రోజున లక్ష్మీనారాయణులను ఉసిరి చెట్టు వద్ద ఆవాహన చేసి పూజిస్తారు. ఉసిరి చెట్టు కింద జగద్ధాత్రి పూజ చేసి, విష్ణు సహస్ర నామం, కనకధారా స్తోత్రం వంటివి పఠించడం అత్యంత శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. దీని వలన కీర్తి, జ్ఞానం, సంపదలు వృద్ధి చెందుతాయని అంటున్నారు.


