News July 27, 2024
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు

కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ ఉన్నట్టుండి పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹270 పెరిగి ₹69,000 చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.63,250గా ఉంది. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ₹84,500గా ఉంది. వరుసగా ధరలు తగ్గడంతో బంగారం కొనుగోళ్లపై ఆసక్తి కనబరిచిన కొనుగోలుదారులు.. తాజాగా ధరలు పెరగడంతో కొంటారా? వెనక్కి తగ్గుతారా? అనేది చూడాలి.
Similar News
News January 12, 2026
ICMR-NIIRNCDలో 45 పోస్టులకు నోటిఫికేషన్

<
News January 12, 2026
అత్తారింటికి కొత్తగా వెళ్తున్న కోడలు పాటించాల్సిన నియమాలు..

నూతన వధువు అత్తారింట్లో అడుగుపెట్టిన తొలి 6 నెలలు ఎంతో కీలకం. ఈ సమయంలో కోడలు ఓర్పుతో ఉండాలి. కుటుంబీకుల అలవాట్లను గమనిస్తూ వారితో మమేకం కావాలి. ప్రతి శుక్రవారం తలస్నానం చేసి ఇష్టదైవానికి పాయసం నైవేద్యం పెట్టాలి. ఈ నియమం బాధ్యతలకే పరిమితం కాకుండా, భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుతుంది. స్త్రీ ఆత్మగౌరవాన్ని రక్షిస్తుంది. కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ, సామరస్యంగా జీవించడమే ఈ సంప్రదాయాల ప్రధాన ఉద్దేశం.
News January 12, 2026
పంట వ్యర్థాలను ఇలా వాడుకోవడం ఉత్తమం

పంట వ్యర్థాలను పశువుల మేతగా, మల్చింగ్ పదార్థంగా వాడాలి. మల్చింగ్ వల్ల నేలలో తేమను పరిరక్షించవచ్చు. కంపోస్ట్ , బయోగ్యాస్, ఇథనాల్ తయారీ, పుట్టగొడుగుల పెంపకం, బయోచార్ తయారీలో వరి పంట కోత తర్వాతి వ్యర్థాలను వాడుకోవచ్చు. పంట అవశేషాల్లోని నత్రజని, భాస్వరం, పొటాషియం, ఇతర సూక్ష్మపోషకాలు భూమికి, పంటకు మేలు చేస్తాయి. అందుకే భూసారం పెరగడానికి, పర్యావరణ పరిరక్షణకు పంట వ్యర్థాలను భూమిలో కలియదున్నడం ఉత్తమం.


