News September 20, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.820 పెరిగి రూ.1,12,150కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.750 ఎగబాకి రూ.1,02,800 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.2000 పెరిగి రూ.1,45,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

Similar News

News September 20, 2025

హరీశ్ రావుపై ఆ విషయంలోనే కోపం: కవిత

image

TG: కొత్త పార్టీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని MLC కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరే ఆలోచన లేదన్నారు. ‘పార్టీ పెట్టే ముందు KCR వందల మందితో చర్చించారు. నేనూ అదే చేస్తున్నా. తండ్రి పార్టీ నుంచి సస్పెండైన మొదటి కూతుర్ని నేనే. హరీశ్ రావుపై కాళేశ్వరం విషయంలో తప్ప వేరే ఏ విషయంలో కోపం లేదు. కాళేశ్వరం విషయంలో ప్రతీ నిర్ణయం KCRదేనని కమిషన్‌కు హరీశ్ చెప్పారు’ అని మీడియా చిట్ చాట్‌లో పేర్కొన్నారు.

News September 20, 2025

రేపటి నుంచి దసరా సెలవులు

image

TG: గురుకులాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు దసరా సెలవులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3 వరకు సెలవులు ఉండనున్నాయి. అటు జూనియర్ కాలేజీలకు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు హాలిడేస్ ప్రకటించారు. మరోవైపు గురుకుల సొసైటీ పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కాలేజీలకు మాత్రం వారం రోజులు ఆలస్యంగా సెలవులు ఇచ్చారని, వాటికి కూడా రేపటి నుంచే సెలవులు ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

News September 20, 2025

ఏ రోజున ఏ బతుకమ్మ అంటే?

image

సెప్టెంబర్‌ 21 – ఎంగిలి పూల బతుకమ్మ
సెప్టెంబర్‌ 22 – అటుకుల బతుకమ్మ
సెప్టెంబర్‌ 23 – ముద్దపప్పు బతుకమ్మ
సెప్టెంబర్‌ 24 – నానే బియ్యం బతుకమ్మ
సెప్టెంబర్‌ 25 – అట్ల బతుకమ్మ
సెప్టెంబర్‌ 26 – అలిగిన బతుకమ్మ
సెప్టెంబర్‌ 27 – వేపకాయల బతుకమ్మ
సెప్టెంబర్‌ 28 – వెన్నెముద్దల బతుకమ్మ
సెప్టెంబర్‌ 29, 30(తిథి ఆధారంగా) – సద్దుల బతుకమ్మ