News April 3, 2025
బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్!

బంగారం ధరలు ఇవాళ కూడా పెరగడంతో ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.500 పెరిగి రూ.85,600లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.540 పెరగడంతో రూ.93,380 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధర రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,13,900గా ఉంది. గత తొమ్మిది రోజుల్లో గోల్డ్ రేటు రూ.4090 పెరగడం గమనార్హం.
Similar News
News April 4, 2025
రాష్ట్రంలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు

AP: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగి, రూ.30 వేలకు కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. 2024-25లో సగటున రోజుకు రూ.83.38కోట్ల విలువైన మద్యం తాగేశారు. అయితే ప్రభుత్వం లిక్కర్ ధర తగ్గించడంతో అమ్మకాలు పెరిగినా రాబడి పెద్దగా లేదు. దీంతో గతేడాదితో పోలిస్తే విక్రయాల్లో 9.1 శాతం పెరుగుదల కనిపించినా.. విలువ 0.34 శాతం మాత్రమే పెరిగింది. అత్యధికంగా కర్నూలు, అత్యల్పంగా కడప జిల్లాలో అమ్మకాలు జరిగాయి.
News April 4, 2025
వక్ఫ్ బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకం: కిషన్రెడ్డి

వక్ఫ్ సవరణ(UMEED) బిల్లు లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందడం చరిత్రాత్మకమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. వక్ఫ్ సంస్థల్లో మెరుగైన గవర్నెన్స్, పారదర్శకత, అవినీతి నిర్మూలనకు ఈ బిల్లు ఉపకరిస్తుందని ఉద్ఘాటించారు. ముస్లిం మహిళలకు, ఆ కమ్యూనిటీలోని పస్మాందాస్, అఘాఖానీస్కు లబ్ధి చేకూరుస్తుందని పేర్కొన్నారు. పీఎం మోదీ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News April 4, 2025
‘ఇంపాక్ట్’ చూపించి SRHను ఓడించాడు

IPL: కోల్కతాతో నిన్న జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన హైదరాబాద్ను KKR ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ అరోరా కోలుకోలేని దెబ్బతీశారు. ముగ్గురు విధ్వంసకర ఆటగాళ్లు హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్ వికెట్లు పడగొట్టి హైదరాబాద్ ఓటమిని శాసించారు. POTM అవార్డు సొంతం చేసుకున్నారు. SRH హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది.