News April 16, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

రెండు రోజుల గ్యాప్ తర్వాత బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 పెరిగి రూ.88,150కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 990 పెరిగి రూ.96,170 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ. 200 పెరిగి రూ.1,10,000గా ఉంది.
Similar News
News April 16, 2025
వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఎందుకుండాలి?: సుప్రీం

వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు చోటు కల్పించేలా వక్ఫ్ చట్టంలో కేంద్రం చేసిన సవరణను సుప్రీం కోర్టు ఆక్షేపించింది. ‘హిందూ ట్రస్టుల్లో ముస్లింలను నియమిస్తారా? అలాంటప్పుడు వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఎందుకు ఉండాలి?’ అని ప్రశ్నించింది. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకస్తూ వచ్చిన పిటిషన్లను సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం<<16118368>> ఈరోజు విచారించిన సంగతి తెలిసిందే.<<>>
News April 16, 2025
రూ. 4687 కోట్లతో అమరావతి సచివాలయ నిర్మాణం

AP రాజధాని అమరావతిలో సచివాలయ టవర్ల నిర్మాణానికి CRDA టెండర్లను ఆహ్వానించింది. 1,2 టవర్ల నిర్మాణానికి రూ.1,897కోట్లు, 3, 4 టవర్ల నిర్మాణానికి రూ.1,664 కోట్లతో టెండర్లను పిలిచింది. వీటితో పాటు HOD ఆఫీసుకు రూ.1,126 కోట్లతో అదనంగా మరో టవర్ నిర్మాణానికీ టెండర్లను పిలిచింది. అటు అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణానికి ఇప్పటికే టెండర్లను ప్రభుత్వం ఖరారు చేసింది.
News April 16, 2025
వక్ఫ్ సవరణ చట్టంపై స్టే విధించలేం: సుప్రీం

వక్ఫ్ సవరణ చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వివాదంపై దాఖలైన పలు పిటిషన్లపై రేపు మధ్యాహ్నం 2 గంటలకు మధ్యంతర తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. అటు వక్ఫ్ సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వానికి SC నోటీసులు జారీ చేసింది. కలెక్టర్లకు ఇచ్చిన అధికారాలతో పాటు పలు ప్రశ్నలకు 2 వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది.