News August 8, 2025

బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డ్

image

శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాల వేళ బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాయి. వరుసగా ఐదో రోజూ బంగారం ధరలు పెరిగి షాకిచ్చాయి. హైదరాబాద్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర ₹760 పెరిగి ₹1,03,310కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹700 పెరిగి ₹94,700 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,27,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

Similar News

News August 8, 2025

లంచ్ తర్వాత ఈ పనులు చేస్తున్నారా?

image

కొందరు మధ్యాహ్న భోజనం చేసిన వెంటనే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘లంచ్ చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమిస్తే జీర్ణక్రియ మందగిస్తుంది. దీంతో గ్యాస్, అజీర్తి సమస్యలు వస్తాయి. తిన్న వెంటనే స్నానం చేయకూడదు. అలాగే కూల్ వాటర్, జ్యూసులు కూడా తీసుకోకూడదు. వాకింగ్ చేయకూడదు. ముఖ్యంగా లంచ్ తర్వాత సిగరెట్ తాగడం ప్రమాదకరం’ అని చెబుతున్నారు.

News August 8, 2025

Zach Vukusic: 18 ఏళ్లకే కెప్టెన్

image

క్రొయేషియాకు చెందిన జాక్ గ్జేవియర్ మిక్లీ వుకుసిక్ (17Y 312D) ఆ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. దీంతో 18 ఏళ్లకే అంతర్జాతీయ జట్టుకు కెప్టెన్ అయిన తొలి ఆటగాడిగా వుకుసిక్ చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు ఆయన 6 T20లే ఆడటం గమనార్హం. జాక్ తర్వాత నోమన్ అంజాద్ (18Y 24D), కార్ల్ హర్ట్‌మన్లెస్లే (18Y 276D), ఎర్డెన్ బుల్గాన్(18Y 324D), డికుబ్విమానా (19Y 327D) పిన్న వయసు కెప్టెన్లుగా చేశారు.

News August 8, 2025

పులివెందుల ZPTC గెలవాలి: చంద్రబాబు

image

AP: పులివెందుల ZPTC ఉపఎన్నికలో గెలవాలని కూటమి నేతలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గెలవాలనే సంకల్పంతో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికపై కూటమి నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన పులివెందులను మరింత అభివృద్ధి చేద్దామన్నారు. టీడీపీ హయాంలోనే పులివెందులకు కృష్ణా జలాలను అందించి పంటలను కాపాడినట్టు గుర్తుచేశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు.