News March 27, 2025

పెరిగిన బంగారం ధరలు

image

వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 పెరిగి రూ.82,350లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 పెరగడంతో రూ.89,840 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,11,000గా ఉంది.

Similar News

News March 30, 2025

కాంట్రాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త

image

AP: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ బిల్లుల చెల్లింపులు చేయనున్నట్లు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ఇందులో చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇస్తామని, సుమారు 17 వేల మందికి రూ.2వేల కోట్ల మేర చెల్లింపులు చేయనున్నట్లు పేర్కొన్నారు. గత 3, 4 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నీరు-చెట్టు, పాట్ హోల్ ఫ్రీ రోడ్లు, ఇరిగేషన్, నాబార్డు పనులకు పేమెంట్స్ చేస్తామని వివరించారు.

News March 30, 2025

అక్టోబర్‌లో ఆసీస్ పర్యటనకు భారత్

image

ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. 3 వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. షెడ్యూల్ ఇలా..
OCT 19: మొదటి వన్డే(పెర్త్)
OCT 23: సెకండ్ వన్డే(అడిలైడ్)
OCT 25: మూడో వన్డే(సిడ్నీ)
OCT 29: ఫస్ట్ టీ20(మనుకా ఓవల్)
OCT 31: రెండో టీ20(MCG)
NOV 2: థర్డ్ టీ20(బెల్లిరివ్ ఓవల్)
NOV 6: నాలుగో టీ20(గోల్డ్ కోస్ట్)
NOV 8: ఫిఫ్త్ టీ20(గబ్బా)

News March 30, 2025

దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల కుట్ర: బండి

image

TG: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మతం పేరుతో దేశాన్ని విభజించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.

error: Content is protected !!