News March 31, 2025
పెరిగిన బంగారం ధరలు

రెండ్రోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధరలు నేడు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.91,190గా ఉంది. అటు 22 క్యారెట్ల పసిడి రూ.650 ఎగిసి రూ.84,250గా విక్రయిస్తున్నారు. గత పది రోజుల్లో బంగారంపై ఇది రెండో అత్యధిక పెరుగుదల. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ ధర రూ.1,13,000గా విక్రయాలు జరుగుతున్నాయి.
Similar News
News November 18, 2025
సతీశ్ మృతి కేసు.. కీలకంగా ఫోన్ డేటా!

AP: టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ మృతి కేసు దర్యాప్తులో ఆయన ఫోన్లోని సమాచారం కీలకంగా మారింది. ఫోన్ ధ్వంసమవడంతో ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. పరకామణి చోరీ కేసులో ఈ నెల 6న విచారణకు హాజరైన సతీశ్ 13న అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీంతో ఆ రెండు తేదీల మధ్య ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలుసుకునేందుకు మెసేజ్లు, వాట్సాప్ కాల్స్, ఇంటర్నెట్ కాల్స్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.

తిరుమల అప్డేట్స్

* టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఏడుకొండలవాడిని 71,208 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు లభించింది.
* టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ఇవాళ ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. పది రోజుల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.