News August 21, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.600 పెరిగి రూ.1,00,750కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.500 ఎగబాకి రూ.92,300 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,26,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News March 12, 2026
గ్యాస్ కొరత.. రాష్ట్రంలోని హోటళ్ల కీలక నిర్ణయం

కమర్షియల్ గ్యాస్ కొరత, నిర్వహణ ఖర్చులపై AP హోటల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు విజయవాడలో అత్యవసరంగా సమావేశమైంది. గ్యాస్ ఇబ్బందుల దృష్ట్యా స్టార్ హోటళ్లలో స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఆర్డర్లను త్వరలోనే నిలిపివేస్తామని పేర్కొంది. ప్రతి సోమవారం రెస్టారెంట్లు క్లోజ్ చేయాలని నిర్ణయించింది. కర్ణాటక తరహాలో కొన్ని హోటల్స్ కేవలం టీ, కాఫీలు మాత్రమే విక్రయించే పరిస్థితి రాబోతోందని తెలిపింది.
News March 11, 2026
400 మిలియన్ బ్యారెళ్ల చమురు రిలీజ్ చేయనున్న IEA

అత్యవసర నిల్వల నుంచి 400 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) ప్రకటించింది. క్రూడ్ ఆయిల్ ధరలను నియంత్రించేందుకు 32 సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. IEA వద్ద ప్రస్తుతం 1.2 బిలియన్ బ్యారెళ్లకుపైగా చమురు నిల్వలు ఉన్నాయి. ఇలా IEA ఆయిల్ రిలీజ్ చేయడం ఇది ఆరోసారి. గతంలో 1991, 2005, 2011 సహా 2022లో రెండుసార్లు ఆయిల్ రిలీజ్ చేసింది.
News March 11, 2026
భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ స్టవ్స్ సేల్స్.. NO STOCK

గ్యాస్ కొరత నేపథ్యంలో ఇండక్షన్ స్టవ్స్‌కు డిమాండ్ పెరిగిపోయింది. ఎలక్ట్రిక్ ప్రెజర్ కుకర్స్, రైస్ కుకర్స్‌ను విపరీతంగా కొనేస్తున్నారు. బ్లింకిట్, స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు 2-3 రోజులుగా ఆర్డర్లు పోటెత్తుతున్నాయి. ఒక్క ఫ్లిప్‌కార్ట్‌లోనే 300% సేల్స్ పెరిగాయి. దీంతో వాటిలో sold out, out of stock బోర్డులు కనిపిస్తున్నాయి. దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి. ఎలక్ట్రిక్ స్టవ్స్ మీరూ కొంటున్నారా?


