News October 3, 2024
ఇవాళ కూడా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ మరోసారి రేట్లు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.660 పెరిగి రూ.77,560కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.100 పెరిగి రూ.71,100గా నమోదైంది. అటు కేజీ సిల్వర్ రేట్ రూ.1,01,000గా కొనసాగుతోంది.
Similar News
News November 15, 2025
SBI కస్టమర్లకు BIG ALERT

SBI కీలక ప్రకటన చేసింది. నవంబర్ 30 తర్వాత ఆన్లైన్, యోనో లైట్ ద్వారా డబ్బును పంపే, క్లెయిమ్ చేసే mCASH సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. UPI, IMPS, NEFT, RTGS తదితర డిజిటల్ పేమెంట్ సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. లబ్ధిదారుడిని ముందుగా రిజిస్టర్ చేయకుండానే మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీ ద్వారా డబ్బు లావాదేవీలు చేయడం కోసం mCASHను గతంలో SBI తీసుకొచ్చింది.
News November 15, 2025
అంతులేని ప్రేమకూ ముగింపు తప్పదు!

అవసరాలు.. అంతులేని ప్రేమకూ ముగింపునిస్తాయని తెలిపే ఘటన చైనాలో జరిగింది. 2017లో జాన్ అనే మహిళ లంగ్ క్యాన్సర్తో ఎంతోకాలం జీవించదని డాక్టర్లు తెలిపారు. భార్యను అమితంగా ప్రేమించే భర్త జున్మిన్ ఆమెను cryopreservation పద్ధతిలో సంరక్షించేందుకు ఓ సంస్థతో 30ఏళ్ల ఒప్పందం చేసుకున్నాడు. ఇలా చేసిన తొలి వ్యక్తిగా నిలిచాడు. అయితే ఇటీవల అనారోగ్యానికి గురైన అతను తోడులేకుండా ఉండలేనని రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు.
News November 15, 2025
అసలు క్రయోప్రిజర్వేషన్ అంటే ఏమిటి?

ప్రస్తుతం రోజుకో కొత్త ఆవిష్కరణ మానవ జీవనాన్ని సులభతరం చేస్తోంది. ఈ క్రమంలోనే క్రయోప్రిజర్వేషన్ అనే పద్ధతికి సైంటిస్టులు నాంది పలికారు. అంటే ఒక శవాన్ని ఖననం చేయకుండా -196°C దగ్గర ద్రవ నైట్రోజన్లో నిల్వచేస్తారు. ఫ్యూచర్లో చనిపోయిన వ్యక్తిని బతికించే టెక్నాలజీ వస్తే ఆ దేహాన్ని ఉపయోగించుకుంటారు. రక్తం గడ్డకట్టకుండా, కణాలకు నష్టం జరగకుండా ఆ బాడీని చల్లబరిచే ప్రక్రియలో రక్షక ద్రావణాలను వాడతారు.


