News February 8, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737523738226_81-normal-WIFI.webp)
బంగారం ధరలు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 పెరిగి రూ.79,450లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 పెరగడంతో రూ.86,670 పలుకుతోంది. కాగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
Similar News
News February 8, 2025
అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన ఓ కొడుకు పగ!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739014677510_1199-normal-WIFI.webp)
కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్టుగా న్యూఢిల్లీ సీట్లో అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి ఓ కొడుకు పగ తోడైంది. 1998, 2003, 2008లో ఇక్కడ Ex CM షీలా దీక్షిత్ హ్యాట్రిక్ కొట్టారు. 2013లో ఆమెను ఓడించి AK CM అయ్యారు. ఇక్కడ 3 సార్లు గెలిచిన ఆయన ఈసారి 4089 ఓట్లతో ఓడారు. షీలా కొడుకు సందీప్ దీక్షిత్ (INC)కు ఇక్కడ వచ్చిన ఓట్లు 4568. వీటిని చీల్చకపోతే AKదే విజయం. ఇలా తన తల్లి ఓటమికి ఆయన ప్రతీకారం తీర్చుకున్నారు.
News February 8, 2025
సంచలన వ్యాఖ్యలు.. కేజ్రీవాల్ సీఎం అవుతారు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739015664619_81-normal-WIFI.webp)
ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌పై పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఓటమితో డీలా పడ్డ కేజ్రీవాల్ త్వరలోనే పంజాబ్ సీఎం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తారని వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుత సీఎం భగవంత్ మాన్‌ను కేజ్రీవాల్ రీప్లేస్ చేసే అవకాశం ఉంది. పంజాబ్‌కు హిందూ వ్యక్తి సీఎం అవుతారని రాష్ట్ర AAP అధ్యక్షుడు అమన్ అరోరా కూడా ఇటీవల అన్నారు’ అని బజ్వా గుర్తుచేశారు.
News February 8, 2025
సమంతతో విడాకులు.. ఆ విషయంలో బాధపడ్డా: నాగచైతన్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739014153998_81-normal-WIFI.webp)
సమంతతో తాను విడాకులు తీసుకోవడానికి శోభిత ధూళిపాళ్ల కారణమని జరిగిన ప్రచారంపై నాగచైతన్య స్పందించారు. ‘ఇది చూసి నేను చాలా బాధపడ్డా. ఆమెకు ఈ చెడ్డపేరు రావాల్సింది కాదు. విడాకులకు శోభిత కారణమే కాదు. ఆమె నా జీవితంలోకి ఇన్‌స్టా చాట్‌లా చాలా సాధారణంగా, అందంగా వచ్చింది. మా మధ్య తొలుత స్నేహం, ఆ తర్వాత రిలేషన్‌షిప్ మొదలైంది’ అని స్పష్టం చేశారు. కాగా 2021లో సమంతతో విడిపోయిన చైతూ 2024లో శోభితను వివాహమాడారు.