News July 29, 2024
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఇటీవల కేంద్ర బడ్జెట్ తర్వాత భారీగా తగ్గిన బంగారం ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.160 పెరిగి రూ.69,160కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పెరిగి రూ.63,400గా నమోదైంది. అటు కేజీ వెండిపై రూ.500 పెరగడంతో రూ.85వేలకు చేరింది.
Similar News
News November 28, 2025
అమరావతిలో 15 బ్యాంకులు.. 6541 ఉద్యోగాలు

AP: రాజధాని అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థలు తమ <<18408811>>కార్యాలయాలు<<>> ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందుకోసం రూ.1,328 కోట్లు వెచ్చించనుండగా 6,541 ఉద్యోగాలు రానున్నాయి. సంస్థల జాబితా ఇదే.. APGB, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్కాబ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI, కెనరా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, BOB, ఇండియన్ బ్యాంక్, నాబార్డ్, PNB, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, IDBI, LIC, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్.
News November 28, 2025
రోజుకు 30-35 లీటర్ల పాలు.. ఈ ఆవులతో డెయిరీఫామ్ మేలు

ప్రపంచంలోనే అత్యధికంగా పాలిచ్చే ఆవు జాతుల్లో హోలిస్టిన్ ఫ్రీజియన్ ఒకటి. వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఒక ఈతలో 9వేల లీటర్లకు పైగా పాలు ఇస్తాయి. ఇవి రోజుకు కనీసం 25-30 లీటర్లు, కొన్ని సందర్భాల్లో 35-40 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. పాలలో కొవ్వు 3.5%గా, ప్రొటీన్ 3.1%గా ఉంటుంది. ఈ రకం ఆవులతో డెయిరీఫామ్ నిర్వహణ మేలంటున్నారు వెటర్నరీ నిపుణులు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.
News November 28, 2025
అవసరమైతే కోర్టులో మూలన నిలబెట్టగలం.. రంగనాథ్పై HC తీవ్ర ఆగ్రహం

TG: అంబర్పేట బతుకమ్మ కుంట వ్యవహారంలో విచారణకు హాజరుకాకపోవడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్పై HC ఆగ్రహించింది. న్యాయస్థానం ఉత్తర్వులపై గౌరవం లేదా అని ప్రశ్నించింది. అవసరమైతే ఉ.10.30 గంటల నుంచి సా.4.30 గంటల వరకు కోర్టులో ఓ మూలన నిలబెడతామని ఘాటు వ్యాఖ్యలు చేసింది. బతుకమ్మ కుంట భూవివాదం కొనసాగుతుండగానే పనులు చేపట్టారంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది.


