News August 2, 2024

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

పసిడి ధరలు వరుసగా మూడోరోజు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.330 పెరిగి రూ.70,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.300 పెరిగి రూ.64,800గా నమోదైంది. సిల్వర్ రేట్ కేజీపై రూ.100 పెరిగి రూ.87,200కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలున్నాయి.

Similar News

News December 13, 2025

రేపు సూర్యపేట జిల్లాలో కేటీఆర్ పర్యటన

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. నూతనకల్ మండలం లింగంపల్లిలో కాంగ్రెస్ నాయకులు చేతిలో ఇటీవల హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

News December 13, 2025

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

<>స్పోర్ట్స్ <<>>అథారిటీ ఆఫ్ ఇండియా 11 చీఫ్ కోచ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా లేదా ఒలింపిక్స్ /పారాలింపిక్స్/ అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొన్నవారు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 64ఏళ్లు. వెబ్‌సైట్: https://sportsauthorityofindia.nic.in

News December 13, 2025

బిగ్‌బాస్.. సుమన్ శెట్టి ఎలిమినేట్!

image

బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. సీజన్ ఇంకో వారమే మిగిలుంది కాబట్టి హౌస్‌లో ఉన్న ఏడుగురు సభ్యుల్లో ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. శనివారం ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఆదివారం ఎపిసోడ్‌లో సంజన/భరణి/డెమోన్ పవన్‌లో ఒకరు ఎలిమినేటయ్యే ఛాన్సులున్నాయని SMలో పోస్టులు వైరలవుతున్నాయి.