News November 18, 2024

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

ఇటీవల తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.660 పెరిగి రూ.76,310కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.600 పెరిగి రూ.69,950గా నమోదైంది. మరోవైపు సిల్వర్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధర రూ.99వేలుగా ఉంది.

Similar News

News November 18, 2024

మోదీ మాజీ భద్రతా సిబ్బందికి బిగ్‌బాస్ ఆఫర్.. ట్విస్ట్ ఇచ్చిన EX ఏజెంట్

image

PM మోదీ EX భ‌ద్రతా సిబ్బంది ల‌క్కీ బిష్త్‌కు బిగ్‌బాస్‌-18లో ఛాన్స్ ద‌క్కింది. అయితే, ఆయ‌న ఈ అవ‌కాశాన్ని తిర‌స్క‌రించినట్టు తెలిసింది. EX స్నైప‌ర్‌, RAW ఏజెంట్‌గా ప‌నిచేసిన ఆయ‌న సోష‌ల్ మీడియాలో పాపులర్ అయ్యారు. RAW ఏజెంట్‌గా త‌మ జీవితాలు ఎప్పుడూ గోప్యంగా, మిస్ట‌రీగా ఉంటాయ‌ని లక్కీ అన్నారు. వృత్తిగత జీవితాన్ని బ‌హిర్గ‌తం చేయకుండా శిక్ష‌ణ పొందామ‌ని, తాను దానికే క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు తెలిపారు.

News November 18, 2024

అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు: నారా రోహిత్

image

తన తండ్రి మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన వేళ అండగా నిలిచిన అందరికీ హీరో నారా రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు. ‘ముఖ్యంగా ఈ కష్టకాలంలో మాలో ధైర్యాన్ని నింపిన పెదనాన్న(చంద్రబాబు), పెద్దమ్మ(భువనేశ్వరి), లోకేశ్ అన్నయ్య, బ్రాహ్మణి వదినకు ప్రత్యేకంగా ధన్యవాదాలు’ అని చెప్పారు. కాగా రోహిత్ తండ్రి, సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే.

News November 18, 2024

లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లే లగచర్ల ఘటన: డీకే అరుణ

image

TG: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న 16 మందితో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ ములాఖత్ అయ్యారు. ఫార్మా కంపెనీ కోసం రైతుల నుంచి బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని అరుణ దుయ్యబట్టారు. భూములు ఇవ్వడం ఇష్టం లేకనే ప్రజావేదికను లగచర్ల ప్రజలు బహిష్కరించారని చెప్పారు. లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లే లగచర్లలో దాడి జరిగిందని అన్నారు.