News November 20, 2024

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ కూడా బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రేటు రూ.550 పెరిగి రూ.77,620కి చేరింది. 22 క్యారెట్ల పసిడి 10గ్రా. ధర రూ.500 పెరిగి రూ.71,150గా నమోదైంది. అయితే వెండి ధరల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. కేజీ వెండి ధర రూ.1,01,000గా ఉంది.

Similar News

News December 4, 2025

సాహిత్య భేరిలో భద్రాచలం విద్యార్థినికి ప్రశంసలు

image

భద్రాచలం విద్యార్థిని మడివి గురుత్వ సమందా సింగ్ కథా విభాగంలో ‘పేన్ పండుం అడివి రహస్యం’ కథ ఆకట్టుకుని, నిర్వాహకుల, వీక్షకుల ప్రసంశలు అందుకుంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రపంచ సాహిత్య వేదిక ప్రతిష్టాత్మకంగా అంతర్జాలంలో ఏకధాటిగా 13 గంటల పాటు బాలసాహిత్య భేరి నిర్వహించింది. ఆదివాసీ వేషధారణలో పాల్గొని ప్రత్యేకంగా నిలిచారు. దాంతో గురువారం ఆమెను ఐటీడీఏ పీఓ రాహుల్ అభినందించారు.

News December 4, 2025

టోల్ ప్లాజాస్ @ 25 ఇయర్స్

image

దేశంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం(PPP)లో టోల్ ప్లాజాలు ఏర్పాటై 25 ఏళ్లు అయింది. ప్రభుత్వ రహదారులు, బ్రిడ్జిలపై టోల్ వసూలుకు 1851లో చట్టం చేశారు. 1970లలో దేశంలో రహదారుల నిర్మాణం, టోల్ వసూలు పద్ధతులు ప్రవేశపెట్టారు. 2000 నుంచి ప్రారంభమైన టోల్ ప్లాజాల ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏడాది భారీగా ఆదాయం వస్తోంది. 2024-25లో రూ.73 వేల కోట్లు వసూలవగా.. ఈ ఏడాది రూ.80 వేల కోట్లు వసూలు కావొచ్చని అంచనా.

News December 4, 2025

‘అఖండ-2’ మూవీ.. ఫ్యాన్స్‌కు బిగ్ షాక్

image

అఖండ2 ప్రీమియర్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న బాలయ్య ఫ్యాన్స్‌కు డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ షాకిచ్చింది. సాంకేతిక కారణాలతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలో ప్రీమియర్స్ ఉండవని 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించింది. ఓవర్సీస్‌లో మాత్రం యథావిధిగా ప్రీమియర్స్ ఉంటాయంది. ఇవాళ రాత్రి గం.8 నుంచి షోలు మొదలవుతాయని ప్రకటన వచ్చినా టికెట్స్‌పై సమాచారం లేక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.