News February 13, 2025
బంగారం ధరలు.. తగ్గేదేలే

బంగారం ధర మరోసారి రూ.87వేల మార్క్ దాటింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 తగ్గడంతో రూ.87వేల దిగువకు వచ్చింది. ఇవాళ మళ్లీ రూ.380 పెరగడంతో రూ.87,050కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.400 పెరగడంతో రూ.79,800గా నమోదైంది. అటు కేజీ వెండి ధర రూ.1,07,000గా ఉంది. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉండే అవకాశం ఉంది.
Similar News
News December 1, 2025
ఏలూరు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ఏలూరు రూరల్ మండలం పెనుమాక లంక గ్రామానికి చెందిన సైదు వెంకన్న (47) మాదేపల్లి గంగానమ్మ గుడి వద్ద శనివారం మృతి చెందాడు. కూలి పనులు చేసుకునే వెంకన్న కూలి పనిలో వచ్చిన సొమ్ముతో మద్యం తాగి రోడ్డు పక్కనే నిద్రించేవాడు. శనివారం రోడ్డు పక్కనే అతను మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఏలూరు రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనారోగ్యంతో మృతిచెందాడని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు.
News December 1, 2025
పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రత్యేక పన్ను!

పొగాకు, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రత్యేక పన్నులు విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు-2025, నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు-2025ను ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాక పొగాకు, పొగాకు ప్రొడక్టులపై జీఎస్టీతోపాటు ఎక్సైజ్ లెవీని విధిస్తారని తెలుస్తోంది. పాన్ మసాలా తయారీపై జీఎస్టీతోపాటు కొత్త సెస్ విధించనున్నట్లు సమాచారం.
News December 1, 2025
ఇంతకన్నా శుభకరమైన రోజు ఉంటుందా?

శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి నేడు చాలా అనుకూలమైన, శుభకరమైన రోజని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శివకేశవులకు ఎంతో ఇష్టమైన మార్గశిర మాసం. అందులోనూ నేడు పరమ శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం, విష్ణు పూజలకు పవిత్రంగా భావించే సర్వ ఏకాదశి కలిసి వచ్చాయి. ఈ కలయికకు తోడుగా ఈరోజే గీతా ఆవిర్భవించింది. అందుకే ఈ రోజున ధర్మకార్యాలు చేస్తే ఆ పుణ్యఫలం జన్మజన్మల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.


